Taraka Ratna : నందమూరి తారకరత్న రెండవ వర్ధంతి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన భార్య అలేఖ్య..

తాజాగా నేడు తారకరత్న రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

Alekhya Reddy Emotional Post her Husband Nandamuri Taraka Ratna

Taraka Ratna : హీరో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయి చికిత్స తీసుకుంటూ 2023 ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం నందమూరి కుటుంబానికి, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అప్పట్నుంచి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తారకరత్న గురించి, తన పిల్లల గురించి పోస్టులు చేస్తుంది.

తాజాగా నేడు తారకరత్న రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తారకరత్నకి నిర్వహించాల్సిన కార్యక్రమాలు నిర్వహించి పలు ఫోటోలు షేర్ చేసింది.

Also Read : Dhanaraj – Manchu Lakshmi : మంచు లక్ష్మి – ధనరాజ్ జంటగా సినిమా.. భారీగా ఓపెనింగ్.. ఎందుకు క్యాన్సిల్ అయింది? టైటిల్ ఏంటో తెలుసా?

తారకరత్న ఫోటో, పిల్లల ఫోటోలు షేర్ చేసి.. నిన్ను విధి మా నుండి దూరం చేసిన ఈ రోజుని లోకంలో ఏదీ పూరించదు. నిన్ను కోల్పోయిన బాధ కాలం మాన్పలేని గాయం, భర్తీ చేయలేని హృదయ విదారకం. మేం ఇలా విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు ఇక్కడ లేకపోవచ్చు కానీ నీ ఉనికి మా జీవితాల్లో, నువ్వు విడిచిన కలల్లో, మర్చిపోవడానికి నిరాకరించే ప్రేమలో, నిన్ను మాటలకు మించి, కాలాన్ని దాటి, జీవితానికి మించి మిస్ అవుతున్నాము అని తెలిపింది.

Also Read : Movie Piracy : సినిమాని లీక్ చేసే వాళ్ళను పట్టుకోకుండా.. వాళ్ళని బెదిరిస్తే ఏం లాభం.. పైరసీపై నట్టికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

దీంతో ఈ అలేఖ్య రెడ్డి పోస్ట్ వైరల్ గా మారగా. తారకరత్న అభిమానులు ఆమె పోస్ట్ కింద కామెంట్స్ లో నివాళులు అర్పిస్తున్నారు. తారకరత్నకు ముగ్గురు పిల్లలు అని తెలిసిందే. నిష్క అనే కూతురుతో పాటు తనయ్ రామ్, రేయా అనే ఓ పాప, బాబు కవలపిల్లలు ఉన్నారు. ఇక అలేఖ్య రెడ్డి వైసీపీ మాజీ నేత విజయ సాయి రెడ్డికి బంధువులు అని కూడా అందరికి తెలుసు. రెగ్యులర్ గా వాళ్ళతో కూడా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అలేఖ్య.