Dhanaraj – Manchu Lakshmi : మంచు లక్ష్మి – ధనరాజ్ జంటగా సినిమా.. భారీగా ఓపెనింగ్.. ఎందుకు క్యాన్సిల్ అయింది? టైటిల్ ఏంటో తెలుసా?

గతంలో ధనరాజ్ - మంచు లక్ష్మి జంటగా ఓ సినిమా ఓపెన్ అయి ఆగిపోయింది.

Dhanaraj – Manchu Lakshmi : మంచు లక్ష్మి – ధనరాజ్ జంటగా సినిమా.. భారీగా ఓపెనింగ్.. ఎందుకు క్యాన్సిల్ అయింది? టైటిల్ ఏంటో తెలుసా?

Do You Know Jabardasth Dhanaraj Manchu Lakshmi as Lead Pair in Movie But Movie Shelved Details Here

Updated On : February 18, 2025 / 1:11 PM IST

Dhanaraj – Manchu Lakshmi : జబర్దస్త్ తో పేరు తెచ్చుకున్న ధనరాజ్ సినిమాల్లో కమెడియన్ గా కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు డైరెక్టర్ గా మారి రామం రాఘవం అనే సినిమా తీసాడు. ధనరాజ్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో ధనరాజ్ దర్శకత్వంలో తండ్రి ఎమోషన్ తో తెరకెక్కిన రామం రాఘవం సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ధనరాజ్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

గతంలో ధనరాజ్ – మంచు లక్ష్మి జంటగా ఓ సినిమా ఓపెన్ అయి ఆగిపోయింది. దాని గురించి ధనరాజ్ మాట్లాడుతూ.. నాకు తెలిసిన డైరెక్టర్ అతని కథని అందరి దగ్గర ప్రమోట్ చేసి చెప్పడంతో ఓ నిర్మాత ఒప్పుకున్నారు. నేను, మంచు లక్ష్మి మెయిన్ లీడ్స్ లో సినిమా అనుకున్నారు. నేనింతే హీరోయిన్ శియా గౌతమ్ సెకండ్ హీరోయిన్ అనుకున్నాం. ఆ సినిమాకు పిలవని పేరంటం అనే టైటిల్ పెట్టారు. రామానాయుడు స్టూడియోలో మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా చేసారు. రాఘవేంద్రరావు గారు వచ్చి క్లాప్ కొట్టారు. మంచు మనోజ్ వచ్చాడు అని తెలిపారు.

Also Read : Movie Piracy : సినిమాని లీక్ చేసే వాళ్ళను పట్టుకోకుండా.. వాళ్ళని బెదిరిస్తే ఏం లాభం.. పైరసీపై నట్టికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

అయితే ఆ సినిమా ఎందుకు క్యాన్సిల్ అయిందంటే.. నేను కూడా సంతోషపడ్డాను. కానీ నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్లేసరికి సినిమా చెయ్యట్లేదు అని చెప్పారు నిర్మాతలు. ధనరాజ్ తో సినిమా ఎందుకు, అతనికి మార్కెట్ లేదు, అతను హీరో కాదు, డబ్బులు లాస్ అవుతాయి మీకు అని పలువురు నిర్మాతలకు, డైరెక్టర్ కి చెప్పడంతో వాళ్ళు వద్దు అనుకోని సినిమాని ఆపేసారు అని తెలిపాడు ధనరాజ్.

Do You Know Jabardasth Dhanaraj Manchu Lakshmi as Lead Pair in Movie But Movie Shelved Details Here

2014లో ధనరాజ్ – మంచు లక్ష్మి జంటగా పిలవని పేరంటం అనే సినిమా ఓపెనింగ్ ని గ్రాండ్ గా నిర్వహించారు. కానీ ఆ సినిమా ఇలా ఆగిపోయింది. ఎప్పుడో 1998 లోనే సినీ పరిశ్రమకు వచ్చి ఇక్కడ కష్టాలు పడుతూ 2004 లో జై సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి 2007 లో జగడం సినిమాతో గుర్తింపు తెచ్చుకొని అప్పట్నుంచి కమెడియన్ గా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు ధనరాజ్. ఇక జబర్దస్త్ లోకి వచ్చాక మరింత స్టార్ డమ్ తెచ్చుకున్నాడు ధనరాజ్. ఇటీవల నిర్మాతగా ఓ సినిమా చేసి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దర్శకుడిగా మరి రామం రాఘవమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Also Read : Prabhas – Amma Rajasekhar : బాలయ్య సినిమా వల్ల ప్రభాస్ తో సినిమా క్యాన్సిల్.. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా..

ఇక మంచు లక్ష్మి సినిమాల్లో నటించిన మధ్యలో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు పలు సిరీస్ లు, ఓటీటీ సినిమాల్లో నటిస్తుంది. ముంబైకి షిఫ్ట్ అయి బాలీవుడ్ లో ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది.