Prabhas – Amma Rajasekhar : బాలయ్య సినిమా వల్ల ప్రభాస్ తో సినిమా క్యాన్సిల్.. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా..

తాను ప్రభాస్ తో సినిమా తీయాల్సింది కానీ క్యాన్సిల్ అయింది అని ఆసక్తికర విషయం తెలిపాడు అమ్మ రాజశేఖర్.

Prabhas – Amma Rajasekhar : బాలయ్య సినిమా వల్ల ప్రభాస్ తో సినిమా క్యాన్సిల్.. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా..

Amma Rajasekhar Planned Movie with Prabhas But Due to Balakrishna Movie it Cancelled

Updated On : February 18, 2025 / 11:35 AM IST

Prabhas – Amma Rajasekhar : కొరియోగ్రాఫర్ గా ఎదిగిన అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత డైరెక్టర్ గా కూడా మారి సినిమాలు తీసాడు. ఓ రెండు హిట్ సినిమాలు తీసినా మిగిలినవి అన్ని ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో సినీ పరిశ్రమకు కొన్ని రోజులు దూరం అయ్యారు. ఆ మధ్య బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నాడు. ఇటీవలే తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ ని హీరోగా పెట్టి తల అనే సినిమాని తన దర్శకత్వంలోనే తీసాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు.

ఈ తల సినిమా ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా తాను ప్రభాస్ తో సినిమా తీయాల్సింది కానీ క్యాన్సిల్ అయింది అని ఆసక్తికర విషయం తెలిపాడు అమ్మ రాజశేఖర్.

Also Read : Find The Actress : ఈ ఫొటోలో చీర కట్టుకున్న క్యూట్ చిన్నారి ఎవరో తెలుసా? ఇప్పుడు హాట్ హీరోయిన్..

అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఖతర్నాక్ సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా కమిట్ అయింది. నిర్మాత కూడా ఓకే అయ్యారు. అప్పుడే వైవిఎస్ చౌదరి 6 రోజులు షూట్ కి పిలిచారు. మలేషియా వెళ్లి రావాలి. బాలకృష్ణ ఒక్క మగాడు సినిమా కోసం కొరియోగ్రాఫర్ గా పిలిచారు. నేను రాను అంటే ఇంటికి వెళ్లి మా అమ్మకు చీర పెట్టి మా అమ్మతో మాట్లాడారు. మా అమ్మ వెళ్ళమంది. దాంతో నేను ఆ షూట్ కి వెళ్ళాను. అప్పుడు నేను డైరెక్టర్ గా ఫ్లాప్ ఉండటంతో ఇక్కడ సీన్ మారిపోయింది. నేను వెళ్ళొచ్చేలోపు అతనితో సినిమా ఎందుకు ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు, డ్యాన్స్ మాస్టర్ అని ఏదేదో చెప్పారు. దీంతో వచ్చేసరికి సినిమా క్యాన్సిల్ అయిపోయింది అని తెలిపారు.

Also See : Pranita Subhash : మంచు దేశంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. ఫోటోలు చూశారా..?

అయితే అదే కథని పలు మార్పులు చేసి హీరో నితిన్ తో టక్కరి అనే సినిమాని తీసాను అని తెలిపాడు. నితిన్, సదా జంటగా 2007 లో వచ్చిన టక్కరి సినిమా దారుణమైన ఫ్లాప్ అయింది. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్.. సినిమా క్యాన్సిల్ అయి మంచి పని అయింది, లేదంటే మా ప్రభాస్ కి ఫ్లాప్ ఇచ్చేవాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా ఎక్కువ పరాజయాలు చూసాడు. ఇన్నేళ్ల తర్వాత కూడా తన కొడుకుని పెట్టి మళ్ళీ దర్శకుడిగానే సినిమా తీసాడు. ఆ సినిమా కూడా పరాజయం పాలయ్యంది. మరి ఇప్పటికైనా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వదిలేసి మళ్ళీ కొరియోగ్రాఫర్ గా మారతాడా చూడాలి.