Find The Actress : ఈ ఫొటోలో చీర కట్టుకున్న క్యూట్ చిన్నారి ఎవరో తెలుసా? ఇప్పుడు హాట్ హీరోయిన్..
ఇంతకీ ఈ ఫొటోలో చిన్నప్పుడే చీర కట్టుకొని క్యూట్ గా ఉన్న ఈ పాపాయి ఇప్పుడు ఎవరో తెలుసా?

Do You Know this Baby in Photo with her Father Present Popular Actress
Find The Actress : ఈ మధ్య సినీ సెలబ్రిటీలు తమ చిన్నప్పటి ఫోటోలు అప్పుడప్పుడు షేర్ చేస్తున్నారు. దీంతో సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ హాట్ హీరోయిన్ తన చిన్నప్పటి ఫోటో షేర్ చేసింది. వాళ్ళ నాన్నతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది ఈ భామ.
ఇంతకీ ఈ ఫొటోలో చిన్నప్పుడే చీర కట్టుకొని క్యూట్ గా ఉన్న ఈ పాపాయి ఇప్పుడు ఎవరో తెలుసా? సినిమాల్లో హాట్ గా కనిపిస్తూ, సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫొటోలతో హీట్ పెంచుతున్న సీరత్ కపూర్. సీరత్ తన తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటో షేర్ చేసి.. నాన్న, మీరు స్వర్గలోకానికి వెళ్లే ముందు నేను కౌగిలించుకున్న చివరి రోజు. 15 సంవత్సరాల నుండి మరియు మొదటిసారిగా నేను ఈ తేదీని గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. పై నుంచి మీరు నా కోసం ఒక మంచి ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని నేను భావిస్తున్నాను, నేను నెక్స్ట్ అధ్యాయానికి రెడీగా ఉన్నాను అది మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసింది.
Also See : Pranita Subhash : మంచు దేశంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. ఫోటోలు చూశారా..?
దీంతో ఇవాళ వాళ్ళ నాన్న మరణించిన రోజు అని తెలుస్తుంది. అలాగే తన లైఫ్ లో నెక్స్ట్ అధ్యాయం అని చెప్పడంతో త్వరలో పెళ్లి చేసుకోబోతుందా సీరత్ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సీరత్ జిద్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగులో రన్ రాజా రన్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టైగర్, రాజుగారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాథ వినుమా, భామా కలాపం 2, మనమే.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది.
సీరత్ కపూర్ ఇటీవలే ఉషా పరిణయం అనే సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది. సినిమాల్లో హాట్ రోల్స్ చేస్తూనే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది ఈ భామ. ఇటీవల కృష్ణ అండ్ హిస్ లీల థియేటర్స్ లో రీ రిలీజ్ చేయడంతో ప్రమోషన్స్ లో పాల్గొంది.
Also See : Pooja Hegde : ఇదేం చీరకట్టు అమ్మడూ.. వెరైటీ చీరకట్టుతో బుట్టబొమ్మ పూజాహెగ్డే పోజులు..