Movie Piracy : సినిమాని లీక్ చేసే వాళ్ళను పట్టుకోకుండా.. వాళ్ళని బెదిరిస్తే ఏం లాభం.. పైరసీపై నట్టికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే తాజాగా నిర్మాత నట్టి కుమార్ ఈ పైరసీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Producer Natti Kumar Interesting Comments on Movie Piracy
Movie Piracy : ఒకప్పుడు సినిమాల పైరసీ నిర్మాతలను భయపెట్టేది. మధ్యలో కొన్ని రోజులు పైరసి తగ్గనా ఇటీవల మళ్ళీ పెరిగిపోయింది. గత కొన్ని నెలలుగా అయితే రిలీజయిన ప్రతి సినిమా HD ప్రింట్ సినిమా రిలీజ్ రోజే లేక్ అవుతుంది. దీంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఫిలిం ఛాంబర్ లో, సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసినా ఫలితం లేకుండా పోతుంది.
పైగా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ వేరే హీరోల సినిమా టీమ్స్ ని బెదిరించి మరీ పైరసీ చేస్తున్నారు ఇటీవల. ఫ్యాన్స్ వార్స్ కాస్త పైరసీ దాకా వెళ్లిపోయాయి. ఇటీవల దేవర, గేమ్ ఛేంజర్, తండేల్.. ఇలా భారీ సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. రిలీజయిన నెక్స్ట్ డేనే పలు బస్సుల్లో, లోకల్ ఛానల్స్ లో టెలికాస్ట్ చేసేసారు . అయితే తండేల్ పైరసీ పై మాత్రం సినిమాని పైరసీ రూపంలో ఎవరన్నా ఫార్వార్డ్ చేసినా, టెలికాస్ట్ చేసినా కేసులు పెడతాం అంటూ హెచ్చరిక ఇచ్చారు నిర్మాతలు.
అయితే తాజాగా నిర్మాత నట్టి కుమార్ ఈ పైరసీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నట్టి కుమార్ మాట్లాడుతూ.. HD క్వాలిటీ సినిమా బయటకు ఎలా వెళ్తుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళు నిర్మాతలు, దర్శకుడు, ల్యాబ్ వాళ్ళు, అందరికి టెలికాస్ట్ చేసే క్యూబ్ వాళ్ళు. పైరసీ లీక్ అయితే వీళ్లదే కదా తప్పు. ఇంట్లోనే దొంగలు ఉన్నారు. వీళ్ళ దగ్గరే పని చేసే వాళ్ళు తప్పు చేస్తారు. ఒక సినిమా అంటే అనుకోవచ్చు. కానీ అన్ని సినిమాలు లీక్ అవుతున్నాయి అంటే అది ఆలోచించాల్సిందే. ఎవరైనా కావాలని లీక్ చేస్తున్నారా చూడాలి. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. HD సినిమా బయటకు వెళ్ళాలి అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ ల నుంచే వెళ్ళాలి. అవి ల్యాబ్స్ లో కానీ, క్యూబ్ లో కానీ జరుగుతుంది. మూవీ యూనిట్ దాటి సినిమా బయటకు వెళ్తుంది అంటే యూనిట్ లోనే ఎవరో డబ్బుల కోసం ఈ పని చేస్తున్నారు. అసలు తప్పు చేసేది వాళ్ళు. వాళ్ళను పట్టుకోకుండా పైరసీ చూడొద్దు, పైరసీ లింక్స్ పంపొద్దు, అలా చేస్తే కేసులు పెడతాం అంటే ఎలా అని అన్నారు.
నిర్మాత నట్టి కుమార్ చెప్పింది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ మధ్య నిర్మాతలు సినిమా పైరసీ అయితే సినిమాని వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ట్రాన్సర్ చేసే వాళ్ళను, బస్, లోకల్ ఛానల్స్ లో టెలికాస్ట్ చేసే వాళ్ళని బెదిరిస్తూ పోలీసులకు కంప్లేయింట్ ఇస్తున్నారు. కానీ అసలు మొదట సినిమా ఎక్కడ్నుంచి లీక్ అవుతుంది అనేది మాత్రం పట్టుకోలేకపోతున్నారు. దాని వైపు సీరియస్ గా ఆలోచించట్లేదు.
Also Read : Find The Actress : ఈ ఫొటోలో చీర కట్టుకున్న క్యూట్ చిన్నారి ఎవరో తెలుసా? ఇప్పుడు హాట్ హీరోయిన్..
ఇటీవల గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్ అయితే తమన్ దాని గురించి మాట్లాడుతూ.. తెలిసిన వాళ్ళే లీక్ చేసారు, తర్వాత వాళ్ళతోనే మళ్ళీ కలిసి పని చేయాల్సి వచ్చింది అని చెప్పారు అంటే సినీ పరిశ్రమలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. లీక్ చేసిన వాళ్ళు తెలిసినా ఏమి చేయలేని పరిస్థితుల్లో మూవీ యూనిట్ ఉంటే ఇంక పైరసి ఎలా కంట్రోల్ అవుతుంది. ముందు సినీ పరిశ్రమ నుంచి మూవీ యూనిట్ నుంచి సినిమా బయటకు రాకుండా చర్యలు తీసుకుంటే పైరసీ తగ్గే అవకాశాలు ఉంటాయి.