Gangubai Kathiawadi : అలియా సినిమా వచ్చేస్తోందోచ్!

అలియా భట్ మెయిన్ లీడ్‌గా.. క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘గంగూబాయి కథియావాడి’.. (మాఫియా క్వీన్).. రిలీజ్ డేట్ ఫిక్స్..

Gangubai Kathiawadi : అలియా సినిమా వచ్చేస్తోందోచ్!

Gangubai Kathiawadi

Updated On : January 28, 2022 / 2:14 PM IST

Gangubai Kathiawadi: అలియా భట్ మెయిన్ లీడ్‌గా.. క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేస్తూ, ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘గంగూబాయి కథియావాడి’.. (మాఫియా క్వీన్).. గంగూబాయి జీవితం ఆధారంగా రాసిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’ అనే పుస్తకాన్ని బేస్ చేసుకుని ఆమె జీవిత కథనే సినిమాగా తెరకెక్కించారు.

Shruti Haasan : ప్రభాస్ ప్రేయసి ‘ఆద్య’ గా శృతి హాసన్..

ఇంతకుముందు 2022 జనవరి 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. కట్ చేస్తే.. ఆ తర్వాతి రోజే మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).. (2022 జనవరి 7)న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ అలియా యాక్ట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా మూవీ, ‘గంగుబాయి’ హిందీ వెర్షన్ వరల్డ్ వైడ్ రిలీజ్ అనుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ కారణంగా అలియా సినిమాను పోస్ట్ పోన్ చేశారు.

Green India Challenge : ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో రవితేజ హీరోయిన్.. ఎవరెవర్ని నామినేట్ చేసిందంటే..

2022 ఫిబ్రవరి 18న గంగూబాయి విడుదల చేస్తామని చెప్పారు. శుక్రవారం కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25న ‘గంగూబాయి కథియావాడి’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు టీం. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేశారు.