Upasana : ఉపాసనకు స్పెషల్ బహుమతి పంపించిన అలియా భట్..

ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసనకు (Upasana) బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ఒక క్యూట్ బహుమతి పంపింది. అదేంటో తెలుసా?

Alia Bhatt send a gift for Upasana and Ram Charan

Upasana : రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని అందరికి తెలిసిందే. పెళ్లి అయ్యి ఏళ్ళు గడుస్తున్నా ఈ జంట పిల్లలు గురించి గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో అనేక రకమైన మాటలు ఎదురుకున్నారు. అయితే చరణ్ అండ్ ఉపాసన మాత్రం తమ తమ రంగాల్లో బాగా ఎదిగి, ఆర్ధికంగా మరింత బలోపేతం అయ్యాకే పిల్లల్ని కనాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి అయిన 10 ఏళ్ళ తరువాత పేరెంట్ హుడ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ శుభవార్త కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్.. ఈ వార్త విని సంబరాలు చేసుకున్నారు. ఈ ఏడాది ఆగష్టులోనే మెగా ప్రిన్స్ లేదా ప్రిన్సెస్ రానున్నాడు.

Upasana : దుబాయ్‌లో ఉపాసనకి సీమంతం.. వైరల్ అవుతున్న వీడియో!

ఇక ఇది ఇలా ఉంటే, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt), ఉపాసనకు ఒక క్యూట్ బహుమతి పంపింది. అలియా భట్ Ed-a-Mamma అనే క్లాథింగ్ ప్లాట్‌ఫార్మ్ కి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. ఈ ప్లాట్‌ఫార్మ్ లో ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ కిడ్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెన్సీతో ఉండడంతో అలియా Ed-a-Mamma నుంచి ఉపాసనకు, బేబీకి సంబంధించిన డ్రెస్సెస్ గిఫ్ట్ గా పంపించింది. ఈ విషయాన్ని ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ అలియాకి థాంక్యూ చెప్పింది.

Upasana : సమాజం కోరుకున్నప్పుడు కాదు నేను కావాలనుకున్నప్పుడు తల్లినవుతున్నాను..

కాగా చరణ్ అండ్ ఉపాసన ప్రస్తుతం దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి వరకు షూటింగ్స్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్యతో ఉంటూ తనని హ్యాపీ అయ్యేలా చేస్తున్నాడు. ఇక దుబాయ్ లో ఉన్న ఉపాసన సిస్టర్స్ ఆమెకు సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాసన కుటుంబసభ్యులు కూడా హాజరయ్యి సందడి చేశారు. ఇక ఆ ఈవెంట్ లో చరణ్ అండ్ ఉపాసన దిగిన ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.