Alia Bhatt : మా నాన్న మద్యానికి బానిసయ్యాడు.. ఆర్ధిక ఇబ్బందులు చూశాము..
తాజాగా ఓ బాలీవుడ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అలియా భట్ వాళ్ళ నాన్న గురించి పలు సంచలన విషయాలు తెలిపింది.

Alia Bhatt sensational comments on Her Father Mahesh Bhatt goes Viral
Alia Bhatt : బాలీవుడ్(Bollywood) దర్శక నిర్మాత మహేష్ భట్(Mahesh Bhatt) కూతురిగా అలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ప్రస్తుతం అలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు, వరుస విజయాలతో బిజీగా ఉంది. ఇటీవలే గంగూభాయ్ కతీయవాది సినిమాతో నేషనల్ అవార్డు కూడా అందుకుంది.
తాజాగా ఓ బాలీవుడ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అలియా భట్ వాళ్ళ నాన్న గురించి పలు సంచలన విషయాలు తెలిపింది. అలియాభట్ మాట్లాడుతూ.. గతంలో మా నాన్న తెరకెక్కించిన పలు సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దాంతో ఆయన మద్యానికి బానిస అయ్యారు. ఆ సమయంలో మేము చాలా ఆర్ధిక ఇబ్బందులు చూశాము. కానీ కొంతకాలం తర్వాత ఆయన మద్యాన్ని మెల్లి మెల్లిగా వదిలేశారు. ఆ తర్వాత మా అమ్మ, నాన్న ఇద్దరూ కలిసి కష్టపడ్డారు. మళ్ళీ మంచి స్థాయికి వచ్చారు అని తెలిపింది.
ఇక తన తల్లి సోనీ రజ్దాన్ గురించి కూడా చెప్తూ.. అమ్మ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఆమెకి ఎవ్వరూ తెలీదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంది. థియేటర్స్, సినిమాలు, టీవీ.. ఇలా అన్నిటికి ఆడిషన్స్ ఇచ్చింది. చాలా ప్రయత్నాలు చేసి కష్టపడి ఎదిగింది. సినిమాల కోసం ఎంతైనా కష్టపడటం ఆమె దగ్గరే నేర్చుకున్నాను అని తెలిపింది. అలియాభట్ తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.