Aliya Bhatt : రణ్‌బీర్‌తో మానసికంగా నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది
అలియా మెయిన్ లీడ్ లో నటించిన 'గంగూబాయి కతియావాడీ' ఫిబ్రవరి 25న విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అలియాను మీ పెళ్లెప్పుడు అని మీడియా అడగగా............

Ranabir Aliya
Aliya bhatt : ఇటీవల బాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు, లవ్ జంటలు పెరిగిపోయాయి. గత కొంతకాలంగా బాలీవుడ్ లో వరుస ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇక బాలీవుడ్ లో అందరికి తెలిసిన ప్రేమ జంట అలియా భట్, రణ్‌బీర్ కపూర్. వీరిద్దరూ చాలా రోజుల నుంచి రిలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. వీరి అభిమానులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులంతా వీరి పెళ్లి ఇప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వీరిద్దరూ ఎక్కడ మీడియాకి చిక్కినా పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. తాజాగా అలియా భట్ వీరి పెళ్లి గురించి మాట్లాడింది.
Radheshyam : ప్రభాస్ స్టామినా.. అమెరికాలో ఒక్క సినిమా.. 1116 లొకేషన్స్.. 11,116 షోలు..
అలియా మెయిన్ లీడ్ లో నటించిన ‘గంగూబాయి కతియావాడీ’ ఫిబ్రవరి 25న విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అలియాను మీ పెళ్లెప్పుడు అని మీడియా అడగగా దానికి అలియా సమాధానమిస్తూ.. ”మీ పెళ్లెప్పుడు అని పదే పదే అడుగుతున్నారు. దీని గురించి రెండు విషయాలు చెప్పాలి. మొదటిది ఇది ఎవరికీ సంబంధించిన విషయం కాదు, నా వ్యక్తిగతం. ఇక రెండోది పెళ్లి అనేది మనసుకు సంబంధించిన విషయం. రిలేషన్షిప్ లో ప్రశాంతంగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. నాకు, రణ్‌బీర్ కు ఇష్టం వచ్చినప్పుడు మేము ఎప్పుడు జరగాలనుంటే అప్పుడే మా వివాహం జరుగుతుంది. నిజం చెప్పాలంటే రణ్‌బీర్‌తో మానసికంగా నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది. నా చిన్నప్పుడు రణ్‌బీర్‌ను మొదటిసారి స్క్రీన్‌పై చూసినప్పుడే పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను” అని తెలిపింది.