Allu Aravind comments on Jeevitha Rajasekhar case Chiranjeevi
Allu Aravind : 2011లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ (Jeevitha Rajasekhar) అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు పై అప్పటిలో నిర్మాత అల్లు అరవింద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు వారి పై కోర్ట్ లో పరువు నష్టం దావా కూడా వేశారు అల్లు అరవింద్. దాదాపు 12 ఏళ్ళ పాటు ఈ కేసు పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. జీవిత, రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడం, వారు అబద్ధపు వ్యాఖ్యలు చేశారని ప్రూవ్ అవ్వడంతో వారిద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తు తీర్పుని ఇచ్చింది. ఆ తర్వాత వారు బెయిల్ తెచ్చుకొని పై కోర్టుకి అప్పీల్ చేశారు.
Chiru – Pawan : పవన్ కళ్యాణ్‌ని తిట్టిన ఒక ఇంటి ఓనర్‌కి.. చిరంజీవి ఫోన్ చేసి వార్నింగ్..
ఇక ఈ విషయం పై ఇప్పటి వరకు మెగా కుటుంబం నుంచి ఎవరు మాట్లాడలేదు. కేసు వేసిన అల్లు అరవింద్ కూడా మీడియా ముందు ఎక్కడ నోరు విప్పలేదు. తాజాగా భోళా శంకర్ (Bholaa Shankar) ప్రీ రిలీజ్ వేదిక పై అల్లు అరవింద్ ఆ కేసు గురించి మాట్లాడారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “నేను ఇక్కడికి వచ్చింది సినిమా సక్సెస్ కావాలని చెప్పడానికి కాదు. ఎందుకంటే ఆయన చూడని బ్లాక్ బస్టర్ లేవు, ఆయన చూడని కలెక్షన్స్ లేవు. మీరు ఆయన సినిమాలు చూస్తూ అభిమానులు అయ్యి ఉంటారు. కానీ నేను ఆయనతో సినిమాలో చేస్తూ అభిమానిని అయ్యాను. ఆ అభిమానం ఎలాంటిది అంటే.. ఆయన్ని పై తప్పుడు మాటల మాట్లాడినందుకు వాళ్ళని జైలుకి పంపించేందుకు 12 ఏళ్ళు పాటు పోరాడాను. అది నా అభిమానం” అంటూ పేర్కొన్నాడు.
Hyper Aadi : మెగా ఫ్యామిలీని విమర్శించే వారికీ హైపర్ ఆది పంచ్.. కుర్చీ మడత పెట్టి..
అలాగే భోళాశంకర్ దర్శకుడు మెహర్ రమేష్ గురించి మాట్లాడుతూ.. “తనని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిరంజీవి అంటే తనకి ఎంతో అభిమానం. ఆ ప్రేమతోనే ఈ సినిమాని తెరకెక్కించాడు. అతని కోసం ఇక్కడికి వచ్చాను. అతని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పడానికి వచ్చాను” అంటూ చెప్పుకొచ్చాడు.