Mrunal Thakur : టాలీవుడ్‌కి కోడలుగా మృణాల్ ఠాకూర్.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్..

SIIMA అవార్డుల్లో టాలీవుడ్‌కి కోడలుగా మృణాల్ ఠాకూర్ అంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

allu aravind comments on Mrunal Thakur at SIIMA 2023 awards

Mrunal Thakur : బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇక టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉండడంతో ఇక్కడ వరుస ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం నాని సరసన ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల్లో నటిస్తుంది. ఇది ఇలా ఉంటే, ఇటీవల ఈ భామ ఇటీవల సౌత్ బిగ్గెస్ట్ అవార్డుల ఫంక్షన్ SIIMA ఈవెంట్ లో పాల్గొంది. సీతారామం సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని సొంతం చేసుకుంది.

ఇక ఈ అవార్డుని టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ చేతులు మీదుగా అందుకుంది. అవార్డు అందించిన తరువాత అల్లు అరవింద్, మృణాల్ తో మాట్లాడుతూ.. “గతంలో ఒక వేదిక పై ఒక హీరోయిన్ తో ఒక మాట అన్నాను. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొని టాలీవుడ్ కి కోడలుగా వచ్చేమని. ఆ మాటని ఆ యాక్ట్రెస్ నిజం చేసింది. ఇప్పుడు నీతో కూడా అదే మాట అంటున్నా.. టాలీవుడ్ కోడలుగా హైదరాబాద్ వచ్చేయ్” అంటూ కామెంట్స్ చేశాడు. దానికి మృణాల్ సిగ్గుపడుతూ నవ్వుతూ సమాధానం ఇచ్చేసింది.

Also read : Indian 2 : భారతీయుడు వచ్చేస్తున్నాడు.. కమల్ పుట్టినరోజు కంటే ముందే ఫ్యాన్స్‌కి గిఫ్ట్..

మరి అల్లు అరవింద్ మాటల్ని మృణాల్ కూడా నిజం చేస్తుందా..? అనేది చూడాలి. ఇక మృణాల్ నటిస్తున్న హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విషయానికి వస్తే.. హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే.. సంక్రాంతి కానుకగా తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు ఫ్యామిలీ కథాంశం సినిమాలు కావడం విశేషం.