Site icon 10TV Telugu

Chiranjeevi : అల్లు కనకరత్నమ్మ మృతి.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Allu Aravind mother kanakaratnam passed away chiranjeevi emotional post

Allu Aravind mother kanakaratnam passed away chiranjeevi emotional post

Chiranjeevi : అల్లు అర‌వింద్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన త‌ల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ (94) క‌న్నుమూశారు.

గ‌త కొన్నాళ్లుగా వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె శ‌నివారం తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. ఈ క్ర‌మంలో చిరంజీవి (Chiranjeevi ) ఎమోషనల్ పోస్ట్ చేశారు.

‘మా అత్తయ్య.. దివంగ‌త‌ అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ ఓం శాంతిః అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Mowgli : యాంకర్ సుమ కొడుకు రెండో సినిమా.. మోగ్లీ గ్లింప్స్ వచ్చేసింది.. నాని వాయిస్ ఓవర్ తో..

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే చిరంజీవి కుటుంబం అల్లుఅర‌వింద్ నివాసానికి చేరుకుంది. అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్ లు షూటింగ్ నిమిత్తం ముంబై, మైసూర్‌లో ఉన్నారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే వారు హుటాహుటీన హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు.

Exit mobile version