Allu Aravind Mother : నేడు ఉదయం అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నేడు శనివారం తెల్లవారుజామున మరణించారు. చిరంజీవికి అత్తమ్మ కావడంతో అల్లు, మెగా ఫ్యామిలీలు తీవ్ర విషాదంలో ఉన్నారు.(Allu Aravind Mother)
సినీ ప్రముఖులంతా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి ఆమెకు నివాళులు అర్పించి అల్లు, మెగా కుటుంబాలను పరామర్శిస్తున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అయాన్ లు పాడె మోశారు. అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు కోకాపేట్ లో ఉన్న అల్లు వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. అల్లు అరవింద్ తన తల్లికి అంతిమ సంస్కారాలు చేశారు. మెగా ఫ్యామిలీ కూడా అంత్యక్రియలలో పాల్గొన్నారు.
Also See : Allu Aravind : అల్లు అరవింద్ తల్లి మరణం.. సెలబ్రిటీల నివాళులు.. బన్నీ ఇంటి నుంచి ఫొటోలు..