Allu Aravind offers a partnership to hero nikhil
Allu Arvind : గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ’18 పేజిస్’ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. గీతా ఆర్ట్స్-2, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఏ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వకుండా డైరెక్ట్‌గా అల్లు అరవిందే రిలీజ్ చేసుకున్నాడు. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
18 Pages: మరో బంపరాఫర్ కొట్టేసిన 18 పేజెస్ డైరెక్టర్..?
కాగా నిఖిల్ కార్తికేయ-2 విజయంతో.. ఈ మూవీ నాన్ ధియేట్రికల్ రైట్స్ అండ్ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకి అమ్ముడు పోవడంతో, విడుదలకు ముందే నిర్మాతలకు సినిమా పెట్టుబడి వచ్చేసిందని తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే కలెక్షన్లు అన్నీ నిర్మాతలకు ప్రాఫిట్స్ కావడంతో అల్లు అరవింద్ చాలా హ్యాపీగా ఉన్నాడు. దీంతో హీరో నిఖిల్ కి అల్లు అరవింద్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు అంటా.
నిఖిల్ ని మరో రెండు సినిమాలు తమ గీతాఆర్ట్స్ బ్యానర్ లో చేయమని కోరాడట అల్లు అరవింద్, అలాగే తనకి పార్టనర్‌గా ఉండమని కూడా నిఖిల్ కి సలహా ఇచ్చాడట. కానీ ఈ ఆఫర్ కి ఇంకా నిఖిల్ ఏ సమాధానం చెప్పలేదట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ’18 పేజిస్’ థాంక్యూ మీట్ లో వెల్లడించాడు. మరి ఈ ఆఫర్లకి నిఖిల్ ఓకే చెబుతాడా? లేదా? చూడాలి.