Allu Aravind spoke about bunny and chiranjeevi relation
Allu Aravind : ఇటీవల గత కొన్ని రోజులుగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చిందని, అల్లు అర్జున్ మెగా ట్యాగ్ నుంచి బయట పడటానికి ట్రై చేస్తున్నాడని, అల్లు పేరు ఇంకా వినపడాలని అల్లు స్టూడియో కట్టారని.. ఇలా అనేక వార్తలు వినిపించాయి. బన్నీ సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకోవడంతో మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సపరేట్ అయిపోయారు. అయితే తాజాగా అల్లు అరవింద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూతో వీటన్నిటికి గట్టిగా సమాధానం చెప్పారు. బన్నీకి చిరంజీవి అంటే ఎంత అభిమానమో తెలియచేశాడు.
మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన బన్నీ, చిరంజీవి రిలేషన్ గురించి మాట్లాడారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ”చిరంజీవికి బన్నీ అంటే కొడుకుతో సమానం. బన్నీ ఏం చేసినా కూడా చిరంజీవి ఎంజాయ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి బన్నీ, చరణ్ కలిసి డ్యాన్సులు చేస్తుంటే ఎంకరేజ్ చేసేవారు. ఇక బన్నీకి అయితే చిరంజీవి అంటే చాలా ఇష్టం. అల వైకుంఠపురములో సినిమా ఈవెంట్‌లో బన్నీ చెప్పాడు. ఈ కట్టె కాలేవరకు చిరంజీవి అభిమానినే అని చెప్పాడు. ఆ మాట విని కింద కూర్చున్న నాకే అనిపించింది చిరంజీవి అంటే బన్నీకి ఎంత ఇష్టమో అని. ఎప్పుడన్నా చిరంజీవి గురించి మా ఇంట్లో టాపిక్ వస్తే ఆయన వేరే లెవెల్, ఆయన స్థాయి వేరు, దేవుడి రేంజ్ ఆయనది అంటూ చెప్తూ ఉంటాడు” అని తెలిపారు. దీంతో అల్లుఅరవింద్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.