Allu Arha : అల్లు అర్హలో ఈ టాలెంట్ కూడా ఉందా..!
స్నేహా రెడ్డి షేర్ చేసిన అల్లు అర్హ వీడియో చూసి.. అందరూ తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు..

Allu Arha
Allu Arha: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల గారాల పట్టి అల్లు అర్హ సోషల్ మీడియాలో చిన్నసైజు సెలబ్రిటీ. నాన్నతో కలిసి అల్లరి చెయ్యడం, ముద్దుముద్దుగా డైలాగ్స్ చెప్పడం, స్పెషల్ డేస్ రోజు స్పెషల్‌గా రెడీ అవడం… ఇలా అర్హకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్ అండ్ నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు స్నేహా.
View this post on Instagram
రీసెంట్‌గా ఆమె షేర్ చేసిన అర్హ వీడియో చూసి అందరూ తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అర్హ ఏం చేసిందో తెలుసా.. మట్టితో ఎంచక్కా మంచి తాబేలుని తయారు చేసింది. బుజ్జి బుజ్జి చేతులతో భలే ముద్దుగా తాబేలు రూపాన్ని చేశావంటూ అల్లు ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇప్పుడు బాలనటిగా రంగప్రవేశం చేసింది అర్హ. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’.. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ రూపొందిస్తుండగా.. గుణ టీం వర్క్స్ బ్యాన్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. అల్లు అర్హ ‘శాకుంతలం’ మూవీలో లిటిల్ ప్రిన్సెస్ భరత క్యారెక్టర్ చేస్తుంది. ఇప్పటికే తన పోర్షన్ షూట్ కంప్లీట్ అయిపోయింది.
View this post on Instagram