సైరా టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. సక్సెస్ అయిన సందర్భంగా మూవీ టీమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ సక్సెస్ పార్టీ ఇచ్చారు.

  • Published By: sekhar ,Published On : October 4, 2019 / 10:34 AM IST
సైరా టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

Updated On : October 4, 2019 / 10:34 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. సక్సెస్ అయిన సందర్భంగా మూవీ టీమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ సక్సెస్ పార్టీ ఇచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’ భారీగా విడుదలైంది.  
అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన సైరా మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుని, రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

Read Also : హైదరాబాద్ లో ‘సూర్యవంశీ’..

ఈ సందర్భంగా మూవీ టీమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ సక్సెస్ పార్టీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, సుకుమార్, త్రివిక్రమ్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, శ్రీకాంత్, అఖిల్ అక్కినేని, వరుణ్ తేజ్, నవదీప్, నిహారిక,సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, బన్నీవాసు, జెమిని కిరణ్ తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు.