Allu Arjun Atlee : ఇక మొదలెడదామా..? అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ ఎప్పట్నుంచి..? దీపికా కూడా రెడీ..

(Allu Arjun Atlee)ఇటీవల అట్లీ, అల్లు అర్జున్ కొన్నాళ్ళు ముంబై వెళ్లి ఈ సినిమా వర్క్ షాప్ చేసి వచ్చిన సంగతి తెలిసిందే.

Allu Arjun Atlee

Allu Arjun Atlee : అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి భారీ హిట్ తర్వాత మరో పాన్ ఇండియా సినిమా అట్లీతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో వారియర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందనే అనౌన్స్మెంట్ వీడియోతో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుందని కూడా ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.(Allu Arjun Atlee)

ఇటీవల అట్లీ, అల్లు అర్జున్ కొన్నాళ్ళు ముంబై వెళ్లి ఈ సినిమా వర్క్ షాప్ చేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాప్ అయిపోయిందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ గురించి సమాచారం వినిపిస్తుంది.

Also Read : Mrunal Thakur : నేషనల్ క్రష్ రష్మిక కాదంట మృణాల్ అంట.. బాలీవుడ్ నటుడి కామెంట్స్ వైరల్..

అల్లు అర్జున్ అట్లీ సినిమా నవంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ జరగనుందని సమాచారం. షూటింగ్ కూడా ముంబైలోనే జరగనుంది. ఈ షూటింగ్ కి దీపికా పదుకోన్ నవంబర్ నుంచి దాదాపు 100 రోజులు డేట్స్ ఇచ్చిందని బాలీవుడ్ టాక్. దీపికా ఇచ్చిన డేట్స్ ని బట్టి అట్లీ వంద రోజుల షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేయనున్నాడు. దీంతో త్వరలోనే బన్నీ సినిమా హెషూటింగ్ మొదలవుతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాలో దీపికా పదుకోన్ మెయిన్ హీరోయిన్ కాగా రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రలు పోషిస్తారని, అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తాడని వినిపిస్తుంది.

Also Read : NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం వార్ 2 క్లైమాక్స్ మార్చారా? లేదా ఆ సినిమా కోసమా?