Allu Arjun Atlee Movie Budget goes viral India Highest Movie Budget with Second Place
Allu Arjun : నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు. ఈ వీడియో లో అల్లు అర్జున్, అట్లీ హాలీవుడ్ వెళ్లి అక్కడ VFX నిపుణులతో మాట్లాడినట్టు, VFX కోసం అల్లు అర్జున్ ఫేస్, బాడీ నమూనాలు తీసుకున్నట్టు చూపించారు. దీంతో హాలీవుడ్ రేంజ్ లో భారీ గ్రాఫిక్స్ తో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
అయితే ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు చర్చగా మారింది. అల్లు అర్జున్ – అట్లీ సినిమా బడ్జెట్ ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాల్లో రెండో సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు దాదాపు 800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని సమాచారం. ఇందులో 175 కోట్లు అల్లు అర్జున్ రెమ్యునరేషన్, 100 కోట్లు అట్లీ రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. మరో 250 కోట్లు కేవలం VFX కే ఖర్చు అవుతుందట. ఆ రేంజ్ లో సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయని టాక్. 200 కోట్లు సినిమా ప్రొడక్షన్ కి, మిగిలింది వేరే ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కి ఇవ్వనున్నట్టు తమిళ మీడియా సమాచారం.
Also Read : Arjun S/O Vyjayanthi : అర్జున్ సన్నాఫ్ వైజయంతి రన్ టైం ఎంతో తెలుసా? సెన్సార్ పూర్తి.. సినిమా చూసి..
దీంతో అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ఈ రేంజ్ లో ఖర్చుపెడుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. మరి హాలీవుడ్ రేంజ్ లో తీసే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇప్పటివరకు ఇండియాలో ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా కల్కి. ఈ సినిమాకు 600 కోట్లు ఖర్చుపెట్టారని సమాచారం. కానీ ప్రస్తుతం మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు 1000 కోట్లు ఖర్చుపెడుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీంతో ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలో మొదట మహేష్ – రాజమౌళి సినిమా ఉండగా, రెండో ప్లేస్ లో అల్లు అర్జున్ – అట్లీ సినిమా ఉంది.