Arjun S/O Vyjayanthi : అర్జున్ సన్నాఫ్ వైజయంతి రన్ టైం ఎంతో తెలుసా? సెన్సార్ పూర్తి.. సినిమా చూసి..
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.

Kalyan Ram Vijayashanthi Arjun S/O Vyjayanthi Movie Completed Censor Run Time Details Here
Arjun S/O Vyjayanthi : కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయశాంతి మళ్ళీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది. విజయశాంతి కళ్యాణ్ రామ్ కు తల్లి పాత్రలో నటిస్తుంది.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా మూవీ యూనిట్ సెన్సార్ పూర్తి చేసుకుంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 24 నిముషాలు.
Also Read : Akkineni Akhil : అయ్యగారి నెక్స్ట్ సినిమా అనౌన్స్.. ఈసారి అక్కినేని అఖిల్ హిట్ పక్కా..
సెన్సార్ వాళ్ళు ఈ సినిమాని చూసి అభినందించారని సమాచారం. తల్లి ఎమోషన్ బాగా పండిందని, విజయశాంతి, కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్రల్లో మెప్పించారని, యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయని, క్లైమాక్స్ అదిరిపోయిందని అన్నట్టు మూవీ యూనిట్ తెలిపింది. క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉందట. ఎమోషన్, యాక్షన్ తో పాటు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఉండబోతుందని తెలుస్తుంది.
కళ్యాణ్ రామ్ బింబిసార, డెవిల్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను మెప్పించి ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో రాబోతున్నాడు. విజయశాంతి చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.