Allu Arjun – Atlee : ప్రభాస్ కి నో చెప్పి.. అల్లు అర్జున్ కి ఓకే చెప్పిన హీరోయిన్.. AA22 లో హీరోయిన్ అనౌన్స్.. వీడియో అదిరింది..

తాజాగా నేడు అల్లు అర్జున్ - అట్లీ సినిమా నుంచి హీరోయిన్ ని ప్రకటిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.

Allu Arjun Atlee Sun Pictures AA22 Movie Heroine Announced

Allu Arjun – Atlee : అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమాని ప్రకటించారు. ఈ సినిమా భారీ స్థాయిలో, భారీ VFX వర్క్ తో హాలీవుడ్ రేంజ్ లో ఉండనుందని తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరా అని చర్చలు సాగుతున్నాయి.

Also Read : Manchu Vishnu – Rajinikanth : కన్నప్ప సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ తీసేసాం.. మంచు విష్ణు కామెంట్స్..

తాజాగా నేడు అల్లు అర్జున్ – అట్లీ సినిమా నుంచి హీరోయిన్ ని ప్రకటిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రకటించారు. మూవీ యూనిట్ రిలీజ్ చేసిన వీడియోలో దీపికాతో కూడా VFX సీన్స్ షూట్ చేసుకున్నారు. ఈ వీడియోలో చూపించిన దానిబట్టి ఇదేదో పీరియాడిక్ యాక్షన్ సినిమా అని తెలుస్తుంది. దీపికాని ఈ సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియో మీరు కూడా చూసేయండి..

ఇటీవల సందీప్ వంగ – ప్రభాస్ సినిమాలో దీపికా పదుకోన్ తప్పుకుందని, మూవీ యూనిట్ వాళ్ళే తప్పించారని వార్తలు వచ్చాయి. దీపికా డిమాండ్స్ పెట్టిందని అందుకే తీసేశారని, సందీప్ తో విబేధాలు వచ్చి దీపికా వెళ్లిపోయిందని కూడా అంటున్నారు. దీంతో ఇటీవల దీపికా బాగా వైరల్ అయింది. అయితే ప్రభాస్ స్పిరిట్ నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో దీపికాని అనౌన్స్ చేయడంతో మరింత చర్చగా మారింది.

Also Read : Manchu Vishnu Wife : వామ్మో.. మంచు విష్ణు భార్య అంత పెద్ద వ్యాపారవేత్తా..? 14 దేశాల్లో బిజినెస్ నడిపిస్తూ..