Unstoppable Season 4 : బాల‌య్య షోలో ప్ర‌భాస్ గురించి అల్లు అర్జున్ ఏం చెప్పారో తెలుసా?

ఆహా వేదిక‌గా బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

Allu Arjun comments on Prabhas in Unstoppable Season 4

ఆహా వేదిక‌గా బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వ‌చ్చారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో ఇప్ప‌టికే విడుద‌ల కాగా రెస్పాన్స్ అదిరిపోయింది. ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ న‌టిస్తున్న మూవీ పుష్ప 2. డిసెంబ‌ర్ 5న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా బ‌న్నీ బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోకు వ‌చ్చారు. బాల‌య్య అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌న్నీ ఎంతో హుషారుగా స‌మాధానం ఇచ్చారు.

Unstoppable Season 4 : ఎన్నికల తర్వాత మొదటిసారి పవన్ గురించి మాట్లాడిన బన్నీ.. అన్‌స్టాప‌బుల్‌లో బాలయ్యతో ఏమన్నాడంటే..

స్ర్కీన్ పై రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఫోటో చూపించారు బాల‌య్య‌. ‘ప్ర‌భాస్‌ను ఎప్పుడు చూసినా సార్‌.. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాది ఒక‌టే మాట‌.. ఆరు అడుగుల బంగారం.’ అని అల్లు అర్జున్ అన్నారు. ప్ర‌భాస్ గురించి బ‌న్నీ ఇంకా ఏం చెప్పాలంటే తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.

రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ రానుంది. పార్ట్ 1 న‌వంబర్ 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Sravanthi Chokkarapu : 40 రోజుల నరకం.. విపరీతమైన బ్లీడింగ్.. హాస్పిటల్ బెడ్ పై ఫోటోలు షేర్ చేసిన యాంకర్..