Unstoppable Season 4 : ఎన్నికల తర్వాత మొదటిసారి పవన్ గురించి మాట్లాడిన బన్నీ.. అన్‌స్టాపబుల్‌లో బాలయ్యతో ఏమన్నాడంటే..
బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Allu Arjun comments on pawan kalyan in Unstoppable Season 4
బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. మూడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాగా వాటికి మంచి స్పందన వచ్చింది. ఇక నాలుగో ఎపిసోడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా రానుంది. తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో ఇప్పటికే వచ్చేసింది.
తన అభిరుచులు, నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఏమనిపించింది వంటి విషయాలను పంచుకున్నారు బన్నీ. ఇక బాలయ్య స్ర్కీన్ పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ ఫోటోను చూపించారు. ఓ లీడర్‌గానే కాకుండా ఆయనతో ఉన్న అనుబంధం గురించి బన్నీ మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ గురించి బన్నీ ఏం మాట్లాడాడు తెలియాలంటే మొత్తం ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ ఎపిసోడ్ ఆహా వేదికగా నవంబర్ 15న స్ట్రీమింగ్ కానుంది.
Lucky Baskhar : వంద కోట్ల ‘లక్కీ భాస్కర్’.. దుల్కర్ సల్మాన్ అదరగొట్టాడుగా..
Powerful questions 🔥, Iconic answers 🥵
Episode lo entertainment taggede le 🔥🔥 Fire lanti episode Loading….#Unstoppable #iconstar #AlluArjun𓃵 #AlluArjunOnAha #stylishstaralluarjun #UnstoppableS4 #UnstoppableWithNBK #balayyapanduga #NandamuriBalakrishna #JaiBalayya… pic.twitter.com/OCVErKT4SZ
— ahavideoin (@ahavideoIN) November 14, 2024