Pushpa 2 Record : ఏ థియేటర్ ఇష్యూలో జైలుకు వెళ్ళాడో.. ఇప్పుడు అదే థియేటర్లో అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డ్.. ఏంటో తెలుసా?

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో సంధ్య థియేటర్లో సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు.

Allu Arjun Creates New Record in Sandhya Theater with Pushpa 2 Movie

Pushpa 2 Record : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమా గత డిసెంబర్ 5న రిలీజయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా పెద్ద విజయం సాధించి ఆల్మోస్ట్ 1850 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. పుష్ప 2 సినిమా 50 రోజులు దాటుతున్నా ఇంకా చాలా థియేటర్స్ లో నడుస్తుంది. మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుంది. తాజాగా పుష్ప 2 సినిమా హైదరాబాద్ సంధ్య థియేటర్లో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.

స్టార్ హీరోల సినిమాలు సింగిల్ స్క్రీన్ రికార్డులు కూడా సెట్ చేసినవి చాలానే ఉన్నాయి. హైదరాబాద్ మోస్ట్ పాపులర్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో సంధ్య థియేటర్ ఒకటి. తాజాగా పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్లో ఆల్ టైం అత్యధిక గ్రాస్ అందుకున్న సినిమాగా నిలిచినట్లు మూవీ యూనిట్ ప్రకటించారు. పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్లో 51 రోజుల్లో 206 షోలు వేయగా ఆల్మోస్ట్ ఒక లక్ష 4 వేల 580 మంది సినిమాని చూడగా 1 కోటి 89 లక్షల 75 వేల 880 రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఆ థియేటర్లో ఒక సినిమాకు ఇదే అత్యధిక కలెక్షన్ కావడం గమనార్హం. అంతే కాకుండా తెలుగు స్టేట్స్ లో కూడా ఒక థియేటర్లో హైయెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా కూడా నిలిచింది పుష్ప 2.

Also Read : SSMB 29 Memes : రాజమౌళి పోస్ట్.. మహేష్ రిప్లై.. మీమ్స్ తో ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఫ్రీ ప్రమోషన్..

దీంతో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో సంధ్య థియేటర్లో సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. అయితే సినిమా రిలీజ్ కి ముందు డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ ఇదే థియేటర్ కి ఫ్యామిలీ, మూవీ యూనిట్ తో రావడం, అల్లు అర్జున్ ని చూడటానికి భారీగా జనాలు వచ్చి అక్కడ తొక్కిసలాట జరగడంతో ఓ మహిళ మృతి చెందడం, ఓ బాబు హాస్పిటల్ లో చేరడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కూడా సీరియస్ అయ్యారు.

ఈ ఘటనలోనే అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లొచ్చారు. అనంతరం ఆ ఫ్యామిలీకి అండగా నిలబడ్డాడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం, అల్లు అర్జున్ ని సినీ ప్రముఖులు పరామర్శించడం, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం, బన్నీ దీని గురించి ప్రెస్ మీట్ పెట్టడం, పోలీస్ విచారణలు.. ఇలా దాదాపు ఓ 20 రోజులు ఈ ఘటన – అల్లు అర్జున్ వార్తల్లో నిలిచారు. అప్పుడు పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర ఘటన జరగ్గా ఇప్పుడు అదే సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సెట్ చేయడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Nuvve Kavali song : సిక్స్ ప్యాక్ తో బిగ్‌బాస్ మెహబూబ్.. శ్రీసత్యతో స్పెషల్ సాంగ్.. సినిమా లెవల్లో భారీగా.. సాంగ్ చూశారా?