SSMB 29 Memes : రాజమౌళి పోస్ట్.. మహేష్ రిప్లై.. మీమ్స్ తో ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఫ్రీ ప్రమోషన్..

రాజమౌళి మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకున్నట్టు పెట్టిన పోస్ట్ పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లు మీమ్స్ వేస్తూ తెగ వైరల్ చేసేస్తున్నారు.

SSMB 29 Memes : రాజమౌళి పోస్ట్.. మహేష్ రిప్లై.. మీమ్స్ తో ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఫ్రీ ప్రమోషన్..

Memes goes Viral after Rajamouli Post with Mahesh Babu Passport Regarding SSMB29

Updated On : January 25, 2025 / 3:25 PM IST

SSMB 29 Memes : రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం సీక్రెట్ గా చేసేసి షూటింగ్ కూడా మొదలుపెట్టేసారు. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూ సినిమాపై రోజు రోజుకి హైప్ పెరుగుతుంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి.

నిన్న రాత్రి రాజమౌళి సింహాన్ని బంధించి మహేష్ బాబు పాస్ పోర్ట్ సీజ్ చేసేసినట్టు ఒక చిన్న వీడియో గ్లింప్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దానికి మహేష్.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని, ప్రియాంక చోప్రా.. ఫైనల్లీ అని రిప్లై లు ఇవ్వడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయిపోయింది.ఈ పోస్ట్ తో ఈ సినిమా షూటింగ్ మొదలైందని, ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది.

Also Read : LYF Teaser : ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ ‘లవ్ యువర్ ఫాదర్’.. టీజర్ చూశారా?

అయితే రాజమౌళి మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకున్నట్టు పెట్టిన పోస్ట్ పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లు మీమ్స్ వేస్తూ తెగ వైరల్ చేసేస్తున్నారు. ఎందుకంటే మహేష్ రెగ్యులర్ గా విదేశాలకు వెకేషన్ కి వెళ్తూ ఉంటాడు. నెలకి ఒకసారైనా ఏదో ఒక దేశంకి వెళ్తాడు. షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా విదేశాల్లోనే ఉంటాడు. మహేష్ వెకేషన్స్ పై గతంలో చాలా మీమ్స్ వచ్చాయి. అందుకే రాజమౌళి తనదైన స్టైల్ లో పాస్ పోర్ట్ తీసేసుకున్నాను అని పోస్ట్ పెట్టడంతో మహేష్ ఇంకెక్కడికి వెళ్ళలేడు, మహేష్ కి వెకేషన్స్ లేనట్టే, మహేష్ రాజమౌళి చేతిలో బుక్కయ్యాడు అన్నట్టు మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.


.

దీంతో ఈ మీమ్స్ వైరల్ అవ్వగా సోషల్ మీడియాలో SSMB29 ట్రెండింగ్ లో ఉంది. ప్రమోషన్స్ నందు రాజమౌళి ప్రమోషన్స్ వేరయా అని తన గత సినిమాల ప్రమోషన్స్ తో చూపించేసాడు. ఇప్పుడు ఎలాంటి అప్డేట్స్ లేకుండానే రాజమౌళి – మహేష్ బాబు సినిమాపై కావాల్సినంత హైప్ ఉంది. ఇక ఇలాంటి చిన్న పోస్ట్ పెట్టేసి సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాడు రాజమౌళి. మహేష్ ఫ్యాన్స్, నెటిజన్లు SSMB29 సినిమాకు కావాల్సినంత ఫ్రీ ప్రమోషన్ ఇస్తున్నారు. ఈ విషయంలో మాత్రం రాజమౌళి ఫుల్ హ్యాపీ. ఈ సినిమా గురించి ముందుముందు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా చిన్న లీక్ వస్తే చాలు బోలెడంత ఫ్రీ ప్రమోషన్ వచ్చేలా ఉంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్లు రాజమౌళి పోస్ట్ పై వేసిన మీమ్స్ మీరు కూడా చూసేయండి..

 

Also Read : Nuvve Kavali song : సిక్స్ ప్యాక్ తో బిగ్‌బాస్ మెహబూబ్.. శ్రీసత్యతో స్పెషల్ సాంగ్.. సినిమా లెవల్లో భారీగా.. సాంగ్ చూశారా?