Nuvve Kavali song : సిక్స్ ప్యాక్ తో బిగ్‌బాస్ మెహబూబ్.. శ్రీసత్యతో స్పెషల్ సాంగ్.. సినిమా లెవల్లో భారీగా.. సాంగ్ చూశారా?
బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే, శ్రీ సత్యలు కలిసి నువ్వే కావాలి అంటూ సాగే ఓ ప్రైవేటు మ్యూజిక్ ఆల్బమ్‌ను చేశారు.

Nuvve Kavali Music Video
బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే, శ్రీ సత్యలు కలిసి నువ్వే కావాలి అంటూ సాగే ఓ ప్రైవేటు మ్యూజిక్ ఆల్బమ్‌ను చేశారు. సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా మనీష్ కుమార్ మ్యూజిక్ అందించడంతో పాటు పాడారు. ఆయనతో పాటు వైషు మాయ సైతం పాడింది. భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్, డైరెక్షన్ అన్ని తానై ఈ పాటను చిత్రీకరించారు.
ఈ పాటను యూరప్‌లోని బార్సిలోన, మెక్సికో, పారిస్ వంటి నగరాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌ల్లో భారీ బడ్జెట్‌తో చిత్రీకరించారు. తాజాగా ఈ పాటను విడుదల చేశారు. సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హనుమంత్, గీతు రాయల్, ఇతర బిగ్ బాస్ సెలబ్రిటీలు, క్రియేటివ్ హెడ్ క్రాఫ్ట్లీ చందు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
LYF Teaser : ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ ‘లవ్ యువర్ ఫాదర్’.. టీజర్ చూశారా?
ఈ సందర్భంగా మెహబూబ్ దిల్ సే మాట్లాడుతూ.. సాంగ్‌ను చూసిన ప్రతి ఒక్కరు బాగుందని చెబుతున్నారు. నా కోసం సమయం కేటాయించి వచ్చిన ఫ్రెండ్స్ తో పాటు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. హోస్ట్ స్రవంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈవెంట్‌ను ఎంతో చక్కగా నిర్వహించిన డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ వాళ్ళకి ధన్యవాదాలు. ఈ సాంగ్‌ని ప్రేక్షకులు ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక శ్రీ సత్య మాట్లాడుతూ.. ఈ పాట ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రోజులు ఎంతో వెయిట్ చేశానని అన్నారు. ఇంత మంది స్నేహితులు సపోర్టు చేయడానికి రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పాట అందరికి నచ్చుంతుందని ఆశిస్తున్నాను. మెహబూబ్‌తో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది, ఈ సాంగ్‌కు తనను తీసుకున్నందుకు భార్గవ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పింది.
Madha Gaja Raja : విశాల్ ‘మదగజరాజ’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. సంతానం కామెడీ అదుర్స్..