Madha Gaja Raja : విశాల్ ‘మదగజరాజ’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. సంతానం కామెడీ అదుర్స్..
విశాల్ ‘మదగజరాజ’ తెలుగు ట్రైలర్ విడుదలైంది.

Madha Gaja Raja telugu Trailer
తమిళ స్టార్ హీరో విశాల్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకనే ఆయన నటించిన చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతూ ఉంటాయి. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఆయన నటించిన మదగజరాజా చిత్రం తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పుడే తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ఉండడంతో వాయిదా వేశారు.
జనవరి 31న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయించారు. సంతానం కామెడీ నవ్వులు పూయిస్తోంది. విశాల్ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది.
సన్యాసం తీసుకున్న ఒకప్పటి తెలుగు హీరోయిన్..
విశాల్, సంతానం, వరలక్ష్మీ శరత్‌కుమార్, అంజలిలు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సోనూసూద్ కీలక పాత్రను పోషించారు. జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సుందర్ సి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
వాస్తవానికి ఈ చిత్రం 2013లోనే విడుదల కావాల్సి వచ్చింది. అయితే.. ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. 12 ఏళ్ల తరువాత 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళంలో మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.