Allu Arjun : అక్కడ పుష్ప 2 సక్సెస్ మీట్ వేళ.. తల్లితో కలిసి అల్లు అర్జున్ ఎమోషననల్ మూమెంట్..

కాగా వెయ్యి కోట్ల వసూళ్లు అందుకున్న నేపథ్యంలో పుష్ప 2 మూవీ టీమ్ తాజాగా ఢిల్లీలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.

Allu Arjun emotional moment with mother

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప 2. తాజాగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది. విడుదలైన ఆరు రోజల్లోనే 1002 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టిస్తుంది పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుండే కాసుల వర్షం కురిపిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

Also Read : Rashmika Mandanna : అల్లు అర్జున్ దమ్మున్న హీరో.. ఆ సీన్ మరే హీరో చెయ్యలేడు.. బన్నీ పై రష్మిక కామెంట్స్..

కాగా వెయ్యి కోట్ల వసూళ్లు అందుకున్న నేపథ్యంలో పుష్ప 2 మూవీ టీమ్ తాజాగా ఢిల్లీలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి పుష్ప మూవీ టీమ్ తో పాటు అల్లు అర్జున్ కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఢిల్లీ కూడా చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్నట్టు తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో సైతం పెట్టాడు. అయితే ఈ ఫోటోతో పాటు తన తల్లి నిర్మలతో ఉన్న ఒక క్యూట్ ఫోటో కూడా షేర్ చేసాడు. పుష్ప సక్సెస్ మీట్ లో భాగంగా ఢిల్లీ వెళ్లే ముందు కాసేపు తన తల్లి తో కలిసి కాసేపు ముచ్చటించాడు బన్నీ.


అల్లు అర్జున్ తన తల్లితో కలిసి ఉన్న ఫోటో షేర్ చెయ్యడంతో వైరల్ గా మారింది. ఇక ఇప్పటికే హైదరాబాద్ లో పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా ఇప్పుడు ఢిల్లీలో చేస్తున్నారు. ఢిల్లీలో సక్సెస్ మీట్ చెయ్యడానికి.. అక్కడ పుష్ప 2 వసూలు చేస్తున్న కలెక్షన్స్ అని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల తర్వాత అంత మొత్తంలో వసూలు చేస్తుంది హిందీలోనే. ఇప్పటికే హిందీలో 375 కోట్లకు పైగా వసూలు చేసింది పుష్ప 2.