Allu Arjun : ముగిసిన అల్లు అర్జున్ విచారణ.. అవసరమైతే మరోసారి విచారణకు రావాలన్న పోలీసులు..

కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ పోలీస్ విచారణ ముగిసింది.

Allu Arjun enquiry Completed in Chikkadapalli Police Station

Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో పోలీసులు అల్లుఅర్జున్ ని విచారణకు పిలవడంతో నేడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు వెళ్లారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఈ విచారణ సాగింది. ఈ విచారణలో పోలీసులు అల్లు అర్జున్ ని పద్దెనిమిది ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. పోలీసుల ప్రశ్నలకు అల్లు అర్జున్ కొన్నిటికి సమాధానం చెప్పగా కొన్నిటికి చెప్పలేదని తెలుస్తుంది.

కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ పోలీస్ విచారణ ముగిసింది. దీంతో బన్నీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తన నివాసానికి బయలుదేరాడు. దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగిన విచారణ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరారు. విచారణ అనంతరం అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అల్లు అర్జున్ కి పోలీసులు చెప్పారు.

Also Read : Sandhya Theatre Incident : సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడు అరెస్ట్.. అతని వల్లే ఇలా అయ్యిందా..?

దీంతో అల్లు అర్జున్ పోలీస్ విచారణకు సహకరిస్తాను అని తెలిపారు. త్వరలోనే రెండోసారి అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇక ఈ విచారణలో అల్లు అర్జున్ ని పుష్ప 2 స్పెషల్ షోకు రావడానికి అనుమతుల గురించి, సంధ్య థియేటర్ యాజమాన్యం గురించి, రేవతి మరణం ఎప్పుడు తెలిసింది? రోడ్ షో గురించి? బౌన్సర్ల గురించి.. వీటికి సంబంధించి ప్రశ్నలు అడిగారు.

మరి అల్లు అర్జున్ ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పారో తెలియాలి. పుష్ప 2 రిలీజ్ సమయంలో ముందు రోజు వేసిన ప్రీమియర్ షోకు సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్, మూవీ టీమ్ రావడంతో అభిమానులు భారీగా వచ్చి బన్నీ కారు వైపు రాగా బౌన్సర్లు తోసేయడంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు స్పృహ తప్పి పడిపోగా హాస్పిటల్ కి తరలించారు. ఆ బాబు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

Also Read : RRR Documentary : ఓటీటీలోకి ‘RRR డాక్యుమెంటరీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?