Allu Arjun: శ్రీవిష్ణు సాంగ్ తో కొత్త వివాదం.. AA బ్రాండ్ కి అవమానం.. మండిపడుతున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్

విష్ణు విన్యాసం(Allu Arjun) సాంగ్ లో హీరో శ్రీవిష్ణు AA బ్రాండ్ ను అవమానించాడు అంటూ మండిపడుతున్న అల్లు అర్జున ఫ్యాన్స్.

Allu Arjun: శ్రీవిష్ణు సాంగ్ తో కొత్త వివాదం.. AA బ్రాండ్ కి అవమానం.. మండిపడుతున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్

Allu Arjun Fans Fire On Hero Sree Vishnu For Insulting Aa Brand

Updated On : January 12, 2026 / 7:26 AM IST
  • శ్రీవిష్ణు సాంగ్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్
  • AA బ్రాండ్ ను అవమానించారు అంటూ ట్రోల్స్
  • మేకర్స్ నుంచి నో రెస్పాన్స్

Allu Arjun: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. ఈయన సినిమాకు మినిమమ్ గ్యారంటీగా ఉంటాయి. అందుకే శ్రీవిష్ణు సినిమాలు చూడటానికి చాలా మంచి ఇష్టపడతారు. తాజాగా శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా విష్ణు విన్యాసం(Allu Arjun). ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Venu Swamy: శివాజీలా నేను మాట్లాడి ఉంటే.. నన్ను బతకనిచ్చేవారు కాదు.. ఐక్యరాజ్య సమితిని రంగంలోకి దించేవారు

ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన పాట ఇప్పుడు కొత్త వివాదానికి తెరతీసింది. ఆ పాటలో అల్లు అర్జున్ ను అవమానించారు అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, అల్లు అర్జున్ తన బ్రాండ్ గా AA పెట్టుకున్న విషయం తెలిసిందే. AA అల్లు అర్జున్ అండ్ అల్లు ఆర్మీ అనే మీనింగ్ వచ్చేలా ఆ బ్రాండ్ సెట్ చేసుకున్నాడు.

తన సినిమాల్లో కూడా అక్కడక్కడా AA బ్రాండ్ చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు విష్ణు విన్యాసం నుంచి విడుదలైన దేఖో విష్ణు విన్యాసం అనే పాటలో AA బ్రాండ్ ను తలకిందులుగా చూపించాడు శ్రీవిష్ణు. AA ని తలకిందులుగా రాస్తే అది VV అవుతుంది. అంటే విష్ణు విన్యాసం అని. కానీ, అల్లు అర్జున్ ను అవమానించడానికే ఆలా చేశారు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో, టాలీవుడ్ లో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి విష్ణు విన్యాసం మూవీ మేకర్స్ ఈ కామెంట్స్ పై ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.