Allu Arjun : జాతీయ ఉత్తమ నటుడు అవార్డుపై మొదటిసారి స్పందించిన అల్లు అర్జున్.. చాలా విభాగాల్లో పుష్ప నామినేషన్లు.. కానీ..

నేషనల్ అవార్డు వచ్చిన అనంతరం మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ..

Allu Arjun First time interacted with media after Winning National Award and his reaction about award

Allu Arjun : సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులు(National Film Awards) ఇటీవలే ప్రకటించారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా ఈ సారి సత్తా చాటి దాదాపు 10 పురస్కారాలు గెలుచుకుంది. వీటిల్లో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(Allu Arjun) అవార్డు సాధించాడు. దీంతో దేశమంతటా అల్లు అర్జున్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాక తెలుగులో నేషనల్ బెస్ట్ యాక్టర్(Best Actor) అవార్డు అందుకున్న మొదటి హీరో కావడంతో గత మూడు రోజుల నుంచి బన్నీ మరింత వైరల్ అవుతున్నారు. ఇప్పటికే బన్నీ అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులంతా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు.

నేషనల్ అవార్డు వచ్చిన అనంతరం మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప సినిమా నుంచి మేము చాలా విభాగాల్లో నామినేషన్లు వేశాం. కచ్చితంగా ఏదో ఒక విభాగంలో అవార్డు వస్తుందని నమ్మాము. అవార్డులు అనౌన్స్ చేసే టైంకి చిత్రయూనిట్ అంతా టీవీ ముందు కూర్చొని ఉన్నాం. ఉత్తమ నటుడు అవార్డు అనౌన్స్ చేయగానే సుకుమార్ ని గట్టిగా హత్తుకొని ఏడ్చేసాను. ఇది అతనికి వచ్చిన పురస్కారమే. సుకుమార్ చెప్పినట్టు నేను చేసాను అంతే. ఈ సారి నామినేషన్స్ లో 20 మంది నటులు పోటీలో ఉన్నారు బెస్ట్ యాక్టర్ కి. సౌత్ నుంచి కూడా కొంతమంది ఉన్నా బాలీవుడ్ నుంచే ఎక్కువగా ఉన్నారు. దేవిశ్రీకి కూడా అవార్డు వచ్చింది, ఇంకా వేరే విభాగాల్లో కూడా వస్తాయని అనుకున్నాం అని తెలిపారు.

Nithiin : పవన్ కళ్యాణ్ టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా.. ‘తమ్ముడు’.. అది కూడా పవన్ డైరెక్టర్ తోనే..

అలాగే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు తెలుగు వారికి మొదటిసారి రావడం, అది కూడా బన్నీకి రావడంపై స్పందిస్తూ.. తెలుగు నటుల్లో మొదటి అవార్డు నేనే సాధించాను అంటే ఆనందం కలిగినా ఎక్కువ షాక్ తిన్నాను. ఒకసారి వెతకమని చెప్పాను. నేను ఏ మూడోవాడినో, నాలుగో వాడినో అవుతాను అనుకున్నాను. కానీ ఛానల్స్ అంత కూడా నేనే ఫస్ట్ అని వేసిన తర్వాత ఆశ్చర్యపోయాను. నేనేదో గొప్ప నటుడని కాదు, నా కంటే గొప్ప నటులు ఉన్నారు. కానీ వారికి ఆ సమయంలో ఎందుకో కుదరలేదు అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు