Allu Arjun in goddess kali mata getup in Pushpa 2
Pushpa 2 : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కలయికలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప (Pushpa). రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేయడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవలే చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా నేడు (ఏప్రిల్ 7) హీరోకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. ప్రేక్షకుల అంచనాలు మించి టీజర్ ఉండడంతో పుష్ప ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు.
Pushpa 2 : అడవిలో పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం..
ఇది ఇలా ఉంటే, టీజర్ తో పాటు మరో పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ కాళీ మాత గెటప్ లో కనిపిస్తున్నాడు. చీర కట్టుకొని, చేతికి గాజులు, ఒంటి పై బంగారంతో చేతిలో గన్ పట్టుకొని ఉగ్ర రూపంలో కనిపిస్తున్నాడు. ఇక పోస్టర్ చూసిన ప్రేక్షకులు అరాచకం అంటున్నారు. సినిమా పై, నటన పై తనకి ఉన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అలాగే టీజర్ లోని ఒక డైలాగ్ కూడా ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని అడ్డుకున్న పోలీసులు.. వైరల్ అవుతున్న వీడియో!
అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చింది అని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సెకండ్ పార్ట్ లో పుష్ప బిజినెస్ ని చైనా, జపాన్, మలేషియా వరకు విస్తరించినట్లు చూపించబోతున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ఈ కండ్ పార్ట్ లో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Happy Birthday to Icon Star @alluarjun ❤️
If his RISE was imperious, his RULE will be epic ❤️?
??????’? ???? ?????? ?
– https://t.co/eNEiADQGP0#Pushpa2TheRule@iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/2kI5Mxchzq— Mythri Movie Makers (@MythriOfficial) April 7, 2023