Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని అడ్డుకున్న పోలీసులు.. వైరల్ అవుతున్న వీడియో!
అల్లు అర్జున్ (Allu Arjun) ‘దేశముదురు’ (Desamuduru) రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ అభిమానులు థియేటర్ లో చేసిన పనికి..

Telangana Police controlling allu arjun fans and stop screening of Desamuduru - Pic Source twitter
Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన సూపర్ హిట్ మూవీ ‘దేశముదురు’ (Desamuduru). పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ తోనే బన్నీ మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ, డాన్సులు, ఫైట్స్ ఆడియన్స్ ని విపరీతంగా అలరించాయి. ముఖ్యంగా బన్నీ ఇంట్రడక్షన్ సీన్ అండ్ క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ సీన్ మాస్ ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతిని కలిగించాయి. ఆ సినిమా తరువాతే టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలైంది. కాగా ఈ మూవీని అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా రీ రిలీజ్ చేశారు.
Pushpa 2 : అడవిలో పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం..
ఈ నేపథ్యంలోనే రెండు రోజులు ముందు నుంచే థియేటర్ల వద్ద ఈ సినిమా సందడి చేయడం మొదలు పెట్టింది. ఇక బన్నీ అభిమానులు థియేటర్ లో సందడి చేస్తూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు హైదరాబాద్ సంధ్యా థియేటర్‌లో అత్యుత్సాహం కనబరిచారు. సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో స్క్రీన్ వద్ద టపాసులు పేల్చి రచ్చ చేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసులను రంగంలోకి దించింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని అడ్డుకున్నారు. అంతేకాదు షో నిలిపివేసి మొత్తం అందర్నీ అక్కడి నుంచి తరలించారు.
కాగా థియేటర్ లో టపాసులు కాల్చిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప – 2 నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సెకండ్ పార్ట్ చైనా, జపాన్, మలేషియాలో కూడా పుష్ప స్మగ్లింగ్ చేయనున్నట్లు టీజర్ లో కనిపిస్తుంది. ఇక ఈ టీజర్ లోని ఒక డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చింది అని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం అనే డైలాగ్ థియేటర్ లో విజుల్స్ వేయించడం ఖాయం.
Nizam districts lo ??
Kothagudem bunny fans mass #Desamuduru4KSpecialShows #DesamuduruCelebrations pic.twitter.com/d5L8jDHjOe— StylishstarAbhimani ?? (@bunnyannacult22) April 7, 2023