అడవిలో అల్లు అర్జున్.. ఎందుకెళ్లాడంటే..

  • Published By: sekhar ,Published On : September 13, 2020 / 02:36 PM IST
అడవిలో అల్లు అర్జున్.. ఎందుకెళ్లాడంటే..

Updated On : September 13, 2020 / 2:44 PM IST

Allu Arjun New Look: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, భార్య స్నేహా రెడ్డి మరియు ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లిన పిక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది బన్నీ వేసిన పర్సనల్ టూర్ మాత్రమే కాదు.. ప్రొఫెషన్‌లో భాగమని తెలుస్తోంది.


అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘పుష్ప’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా కోసం ఇప్పుడు బన్నీ లొకేషన్స్‌ సెర్చ్‌లో ఉన్నారట. అందులో భాగంగా బన్నీ ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రకు చేరుకున్నారు. బన్నీ కుటుంబ సభ్యులు కూడా ఈ జర్నీలో ఆయనతో ట్రావెల్‌ అవుతున్నారు.

Allu Arjun


శనివారం కుంటాల జలపాతంను సందర్శించిన బన్నీ ఇప్పుడు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యంలో పర్యటిస్తున్నారట. క్యాజువల్ వేర్‌లో, రగ్గడ్ లుక్‌లో తనపేరుతో డిజైన్ చేసిన(AA) మాస్క్ ధరించి సఫారిలో ఫారెస్ట్‌లో తిరుగుతూ అక్కడివారికి సెల్ఫీలు కూడా ఇచ్చారు స్టైలిష్ స్టార్. న్యూ లుక్‌లో బన్నీ భలేఉన్నాడంటున్నారు ఫ్యాన్స్..

Allu Arjun

ప్రస్తుతం బన్నీ పర్యటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. డిసెంబర్ నుంచి ‘పుష్ప’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కానుంది.. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

 

Allu Arjun