Nagababu – Allu Arjun : వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు.. పాపం ఫ్యాన్ వార్స్ చేసే బ్యాచ్.. నాగబాబు, అల్లు అర్జున్ మీటింగ్..

మొత్తం విషయంలో మెగా వర్సెస్ అల్లు అనేది బాగా నడుస్తుంది.

Allu Arjun Meets Mega Brother Nagababu Fans Shocked

Nagababu – Allu Arjun : గత కొన్ని రోజులుగా ఎక్క చూసినా అల్ల్లు అర్జున్ గురించే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఏపీ ఎన్నికల సమయంలో తన మామ పవన్ కళ్యాణ్ జనసేనకు కాకుండా వైసీపీ నేతకు ప్రచారం చేసిన దగ్గర్నుంచి బన్నీ వార్తల్లోనే ఉంటున్నాడు. వైసీపీ నేతకు ప్రచారం, దాని గురించి మాట్లాడటం, ఆ తర్వాత పుష్ప 2 భారీ ఈవెంట్స్, పుష్ప ప్రీమియర్స్ లో ఓ మహిళ చనిపోవడం, అల్లు అర్జున్ ఆ కేసులో జైలుకు వెళ్లి రావడం.. ఇలా గత కొన్నాళ్లుగా అల్లు అర్జున్ వార్తల్లోనే ఉంటున్నారు.

ఈ మొత్తం విషయంలో మెగా వర్సెస్ అల్లు అనేది బాగా నడుస్తుంది. బన్నీ వైసీపీ నేతకు ప్రచారం చేసిన దగ్గర్నుంచి జనసైనికులు, మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి కౌంటర్ గా బన్నీ ఫ్యాన్స్ కూడా విమర్శలు చేసారు. దీనికంటే ముందు ఓ సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పను అనేటప్పటి నుంచే ఈ గొడవ ఉన్నా ఎన్నికల అప్పుడు మాత్రం కొంచెం ముదిరి పాకాన పడి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గొడవ సోషల్ మీడియాలో ఇంకా సాగుతూనే ఉంది.

Also Read : Allu Arjun : శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ ట్వీట్.. ఏమన్నారంటే..

ఆ గొడవకు ఇంకొంచెం ఆజ్యం పోసేలాగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చెయ్యడం, నాగబాబు బన్నీ పై ఇండైరెక్ట్ కౌంటర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్ మధ్యే కాదు మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య కూడా సంబంధాలు దెబ్బ తిన్నాయని అంతా అనుకున్నారు. పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్స్ చిరంజీవికి కౌంటర్ గా ఉన్నాయని ఓ సోషల్ మీడియా బ్యాచ్ ప్రచారం చేసింది. గేమ్ ఛేంజర్ కి కౌంటర్ గానే పుష్ప 2 భారీ ఈవెంట్స్ చేసారని చరణ్ ఫ్యాన్స్ వాదన.

ఆ ఎన్నికల సమయం నుంచి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలిలో ఎవ్వరిని కలిసిన దాఖలాలు లేవు. మెగా ఫ్యామిలీలు కూడా బన్నీని పట్టించుకోవట్లేదని వినిపించింది. అసలు పుష్ప 2 సినిమాపై అందరూ ప్రశంసిస్తుంటే మెగా హీరోలు ఎవ్వరూ దాని ఊసెత్తకపోవడం గమనార్హం. ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఇంటికి వచ్చినప్పుడు కూడా టాలీవుడ్ స్టార్స్ అంతా బన్నీ ఇంటికి వెళ్లి పలకరించి వచ్చారు. కానీ మెగా హీరోలు ఎవ్వరూ వెళ్ళలేదు. మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ మేనత్త, చిరంజీవి భార్య సురేఖ గారు మాత్రం వెళ్లి బన్నీని కలిసి వచ్చారు. దీంతో మెగా – అల్లు ఫ్యామిల మధ్య విబేధాలు ఎక్కువే ఉన్నాయని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వార్స్ చేసుకున్నారు.

వాళ్ళు ఎలా ఉన్నారో అధికారికంగా ఎవ్వరికి తెలియకపోయినా ఫ్యాన్స్ మాత్రం రోజు సోషల్ మీడియాలో మా అల్లు అర్జున్ అని, మా మెగా ఫ్యామిలీ అని వార్స్ చేసుకోవడం అలవాటైపోయింది. అయితే ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ అల్లు అర్జున్ నిన్న సడెన్ గా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి స్వయంగా కలవడంతో ఈ వార్త వైరల్ గా మారింది. చిరు – బన్నీ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ ని ఇదే ఆశ్చర్యపరిచింది అంటే అల్లు అర్జున్ స్వయంగా నాగబాబు ఇంటికి వెళ్లి నాగబాబుని కలిసాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

నాగబాబు – అల్లు అర్జున్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీలో ఎవ్వరూ బన్నీని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఏమి అనకపోయినా నాగబాబు మాత్రం ఇండైరెక్ట్ గా బన్నీకి కౌంటర్ గా పోస్టులు వేయడంతో అసలు ఆయన్నే వెళ్లి అల్లు అర్జున్ కలవడం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎప్పుడో మహేష్ బాబు ఫ్యాన్స్ కి చెప్పినట్టు మేము మేము బాగానే ఉంటాము, మీరు బాగుండాలి అని ఇప్పుడు కరెక్ట్ గా ఫ్యాన్ వార్స్ బ్యాచ్ కి సరిపోతుంది. అల్లు – మెగా ఫ్యామిలీలే కాదు ఇండస్ట్రీలో అందరూ బాగుంటారు. కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం మా హీరో అంటే మా హీరో అని సోషల్ మీడియాలో, కొందరైతే బయట కొట్టుకుంటారు. ప్రస్తుతానికి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్స్ బ్యాచ్ కి నాగబాబు – అల్లు అర్జున్ కలయికతో స్వస్తి పడితే మంచిది. ఇక పనిలో పని అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని కూడా కలిస్తే మెగా వర్సెస్ అల్లు గొడవలు అస్సలే ఉండవు, అందరి ఫ్యాన్స్ ఒకటే, ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటారని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.