Allu Arjun : శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ ట్వీట్.. ఏమన్నారంటే..

ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Allu Arjun : శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ ట్వీట్.. ఏమన్నారంటే..

Allu Arjun

Updated On : December 16, 2024 / 12:46 AM IST

Allu Arjun : హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. శ్రీ తేజ్ గురించి తాను ఆందోళన చెందుతున్నానని పేర్కొన్నారు. శ్రీ తేజ్, అతడి కుటుంబాన్ని కలుసుకోవాలని ఉందన్నారు. అయితే, ప్రస్తుతం ఈ ఘటనపై న్యాయపరమైన విచారణ కొనసాగుతోందని, అందుకే శ్రీ తేజ్ ని కలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాను అనే మాటకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు అల్లు అర్జున్. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అల్లు అర్జున్.

పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కికసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కుమారుడు శ్రీ తేజ్ సైతం తొక్కిసలాటలో గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడికి చికిత్స కొనసాగుతోంది. తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిన ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

 

Also Read : అల్లు అర్జున్ అరెస్ట్.. డ్యామేజ్ ఎవరికి .. మైలేజ్ ఎవరికి ..! వీకెండ్ విత్ ప్రొ.నాగేశ్వర్