×
Ad

Allu Arjun : పుష్ప సాంగ్ కి అమెరికా ట్యాలెంట్ షోలో అదిరిపోయే పర్ఫార్మెన్స్.. స్పందించిన అల్లు అర్జున్..

మీరు కూడా అల్లు అర్జున్ మెచ్చుకున్న వీడియో చూసేయండి..

Allu Arjun

Allu Arjun : పుష్ప సినిమాకు, ఆ సినిమా సాంగ్స్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫేమ్ వచ్చిన సంగతి తెలిసిందే. దేశవిదేశాల్లో పుష్ప సాంగ్స్ కి రీల్స్, వీడియోలు చేసారు. అయితే తాజాగా అమెరికా గాట్ ట్యాలెంట్ షోలో B Unique Crew పుష్పలో దాక్కో దాక్కో మేక సాంగ్, మ్యూజిక్ కి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

అమెరికా ఘాట్ ట్యాలెంట్ షోలో ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ ట్యాలెంట్స్ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళ ట్యాలెంట్ ని ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఇండియా జోధ్ పూర్ కి చెందిన B Unique Crew టీమ్ పుష్ప సాంగ్ కి జిమ్నాస్టిక్స్ తో డ్యాన్స్ తో పాటు కొంత క్రియేటివిటీ, టెక్నాలజీ వాడి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలా ఇంటర్నేషనల్ స్టేజిపై పుష్ప సాంగ్ కి ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Also See : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొడుకు ఫోటోలు చూశారా? తిరుమలలో తనయుడికి పేరు పెట్టిన కిరణ్..

ఈ వీడియో పుష్ప సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేయడంతో అల్లు అర్జున్ అద్భుతం, మైండ్ బ్లోయింగ్ అంటూ ఈ వీడియోకి స్పందించాడు. మీరు కూడా అల్లు అర్జున్ మెచ్చుకున్న వీడియో చూసేయండి..

 

Also Read : Gowtam Tinnanuri : టాలీవుడ్ లో పనిచేసినట్టు అక్కడ పనిచేయరు.. బాలీవుడ్ పై కింగ్డమ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
ఇక అల్లు అర్జున్ అట్లీతో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలో ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటించబోతుంది. ఇటీవల కొన్ని రోజులు ముంబైలో వర్క్ షాప్ నిర్వహించారు.