Gowtam Tinnanuri : టాలీవుడ్ లో పనిచేసినట్టు అక్కడ పనిచేయరు.. బాలీవుడ్ పై కింగ్డమ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ టాలీవుడ్ కి బాలీవుడ్ కి ఉన్న వర్క్ డిఫరెన్స్ గురించి చెప్పుకొచ్చాడు.

Gowtam Tinnanuri
Gowtam Tinnanuri : గౌతమ్ తిన్ననూరి గతంలో మళ్ళీ రావా, జెర్సీ.. లాంటి హార్ట్ టచింగ్ సినిమాలు చేసి మెప్పించాడు. జెర్సీ అయితే మంచి విజయం సాధించడమే కాక అవార్డులు కూడా సాధించింది. ఇప్పుడు గౌతమ్ విజయ్ దేవరకొండ తో కింగ్డమ్ సినిమా చేసాడు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తుంది. అయితే గౌతమ్ జెర్సీ సినిమాని హిందీలో కూడా తీసాడు.
జెర్సీ ఇక్కడ హిట్ అయి, అందరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయి, అవార్డులు తెచ్చుకోవడంతో అక్కడ రీమేక్ చేయమని గౌతమ్ కి ఆఫర్ ఇచ్చారు. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా ఈ సినిమాని జెర్సీ టైటిల్ తోనే హిందీలో తెరకెక్కించారు. అయితే అక్కడ అంతగా ఆడలేదు.
నేడు కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ టాలీవుడ్ కి బాలీవుడ్ కి ఉన్న వర్క్ డిఫరెన్స్ గురించి చెప్పుకొచ్చాడు.
గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ.. టాలీవుడ్ లో వర్క్ చేయడం ఈజీ. ఇక్కడ చివరి నిమిషం టెన్షన్స్ ఉన్నా వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ షూటింగ్ టైం ఇంకా పెరిగినా పని చేస్తారు. అక్కడ అయితే కాల్ షీట్ టైం ప్రకారం చేయాల్సిందే. ఇక్కడ సినిమాని ఒక ప్యాషన్ తో, ఇష్టంతో పని చేస్తారు. అక్కడ కార్పొరేట్ స్టైల్ లో జరగాలి. ఇక్కడ చివరి నిషంలో అది చేంజ్ చేయాలి, ఇది చేంజ్ చేయాలి అని అడిగితే రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తారు. అక్కడ అడిగితే ముందే చెప్పాలి, ఈ మెయిల్ చేయాలి అని అంటారు. కింగ్డమ్ కి చివరి నిమిషంలో పనిచేసినట్టు అక్కడైతే చేయలేము, అక్కడ అనుకున్న టైంకి రిలీజ్ చేయలేము అని అన్నారు.
Also Read : Kingdom : ‘కింగ్డమ్’కి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? చెప్పేసిన డైరెక్టర్.. రామాయణం నుంచి..
దీంతో గౌతమ్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఇది నిజమే అంటున్నారు. బాలీవుడ్ సంగతేమో కానీ టాలీవుడ్ లో సినిమా మీద ఇష్టంతో అందరూ టైం చూసుకోకుండా కష్టపడతారు అని అంటున్నారు.