Allu Arjun – Anchor Sravanthi : చీర బాగుంది.. అందంగా ఉన్నారు.. యాంకర్ స్రవంతితో అల్లు అర్జున్.. వీడియో వైరల్..

అల్లు అర్జున్ యాంకర్ స్రవంతితో మాట్లాడుతూ..

Allu Arjun Praising Anchor Sravanthi Chokarapu Beauty in Telangana Gaddar Film Awards Event

Allu Arjun – Anchor Sravanthi : శనివారం జూన్ 14న రాత్రి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. ఇలా చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అర్జున్ 2024 సంవత్సరానికి గాను బెస్ట్ యాక్టర్ గా పుష్ప 2 సినిమాకు అవార్డు అందుకున్నారు.

ఈ ఈవెంట్ కి పలువురు యాంకర్స్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ యాంకర్ స్రవంతితో మాట్లాడుతూ.. చీర చాలా బాగుంది, బాగుంది, అందంగా ఉన్నారు అంటూ మాట్లాడారు. అల్లు అర్జున్ అలా అభినందించడంతో యాంకర్ స్రవంతి ఉబ్బితబ్బిబయిపోతుంది.

Also Read : Balakrishna – Allu Arjun : స్టేజి మీదకు వెళ్లి స్టెప్పులు వెయ్ బన్నీ.. గద్దర్ అవార్డ్స్ వేడుకల్లో బన్నీతో బాలయ్య సరదా.. వీడియో వైరల్..

అల్లు అర్జున్ తో మాట్లాడిన వీడియోని యాంకర్ స్రవంతి తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మనం ఎంతగానో ఇష్టపడే హీరో మనం కట్టుకున్న చీర చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నారు అంటే ఇక భూమి మీద ఆగగలమా అంటూ రాసుకొచ్చింది. దీంతో స్రవంతి పోస్ట్ వైరల్ గా మారింది.