Pushpa 2 Collections : బాబోయ్.. ఊహించిన దానికంటే ఎక్కువ.. పుష్ప 2 నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

తాజాగా నాలుగు రోజుల అధికారిక కలెక్షన్స్ అనౌన్స్ చేసారు.

Allu Arjun Pushpa 2 Four Days World Wide Total Collections Details Here

Pushpa 2 Collections : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా అదరగొడుతుంది. హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. సౌత్, నార్త్, ఓవర్సీస్ అని తేడా లేకుండా అన్ని చోట్లా కాసుల వర్షం కురిపిస్తుంది పుష్ప 2 సినిమా. తాజాగా నాలుగు రోజుల అధికారిక కలెక్షన్స్ అనౌన్స్ చేసారు.

Also Read : Animal 3 : ‘మరింత అరాచకంగా యానిమల్ 3’.. క్లారిటీ ఇచ్చిన హీరో..

పుష్ప 2 మొదటి రోజు పుష్ప ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు గ్రాస్ వసూలు చేసి మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమాగా నిలిచింది. రెండు రోజుల్లో 449 కోట్ల గ్రాస్, మూడు రోజుల్లో ఏకంగా 621 కోట్ల గ్రాస్ వసూలు చేసింది పుష్ప 2 సినిమా. ఇక నిన్న ఆదివారం కావడం, నార్త్ లో పుష్ప 2కి ఆదరణ పెరగడంతో కలెక్షన్స్ భారీగా వచ్చాయి. నిన్న ఒక్కరోజే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది పుష్ప 2 సినిమా. పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో ఏకంగా 829 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఊహించిన దానికంటే పుష్ప 2కి కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజులకు 620 కోట్లు ప్రకటించడంతో నాలుగు రోజులకు ఆదివారం ఉండటంతో 800 కోట్ల వరకు వస్తాయనుకున్నారు. కానీ ఇంకా ఎక్కువే వచ్చాయి. నార్త్ లో రోజు రోజుకి థియేటర్స్, షోలు పెరుగుతుండటంతో పుష్ప 2 కి బాగా కలిసి వస్తుంది. ఇదే జోరు కొనసాగితే వారం లోపే 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అత్యంత వేగంగా 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా పుష్ప 2 నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.