Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొన‌సాగుతున్న పుష్పరాజ్ హ‌వా.. 25 రోజుల్లో ఎంతంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ రికార్డుల వేట కొన‌సాగుతూనే ఉంది.

Allu Arjun Pushpa 2 movie continous monstrous run at Hindi box office

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ రికార్డుల వేట కొన‌సాగుతూనే ఉంది. డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అదిరిపోయే వ‌సూళ్ల‌తో దుమ్మురేపుతోంది. ఇప్ప‌టికే అత్యంత వేగంగా రూ.1700 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించిన భార‌తీయ చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది. ఇక‌ బాలీవుడ్‌లో పుష్ప2 సృష్టిస్తున్న ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికే హిందీలో 700 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సాధించి అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన మూవీగా రికార్డుల‌కు ఎక్కింది.

తాజాగా పుష్ప 2 మూవీ హిందీ వెర్షన్‍లో 25 రోజుల్లో రూ.770.25 కోట్ల నెట్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద వేట‌ కొన‌సాగుతూనే ఉంద‌ని రాసుకొచ్చింది.

Unstoppable with NBK S4 : నంద‌మూరి, మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. బాల‌య్య‌తో సంద‌డి చేయ‌నున్న మెగాప‌వ‌ర్ స్టార్‌

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం 25 రోజుల్లో 1709.63 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కుడు మ‌నోబాల తెలిపారు. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఓవ‌రాల్‌గా అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచిన‌ట్లు పేర్కొన్నారు.

Pawan kalyan – Dil raju : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..

అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ అగ్ర‌స్థానంలో ఉండ‌గా, రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి 2 మూవీ రెండో స్థానంలో ఉంది. ఇదే క‌లెక్ష‌న్లు ఇక‌పై కూడా కొన‌సాగితే.. అతి త్వ‌ర‌లోనే బాహుబ‌లి 2 క‌లెక్ష‌న్ల‌ను బ‌ద్ద‌లు పుష్ప 2 బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశం ఉంది.