Pawan kalyan – Dil raju : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు.

Producer Dil Raju met AP Deputy CM Pawan Kalyan today
Game changer pre release event : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్‌ను దిల్ రాజు కలిశారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని పవన్‌ను ఈ సందర్భంగా దిల్ రాజు కోరారు. అనంతరం సీని పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి వీరిద్దరు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.
శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కింది. కియారా అద్వానీ కథానాయిక. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎస్‌జే సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్‌లు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Allu Arjun : అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే అమెరికాలో ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాకాలు చేస్తోంది. జనవరి 4 లేదా 5 తేదీల్లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు చెప్పారు.
Laila : విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ నుంచి ‘సోను మోడల్’ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయిన స్టెప్పులు..
విజయవాడలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కౌటౌట్‌ను ఏర్పాటు చేయగా ఇందులో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను దిల్ రాజు కలుసుకున్నారు.