Pushpa 2 Collections : పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వస్తాయి? ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు..

పుష్ప 2 సినిమాకు ఇప్పటికే 100 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వచ్చేసాయి.

Pushpa 2 Collections : పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వస్తాయి? ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు..

Allu Arjun Pushpa 2 Movie First Day Collections Target Expecting will Break RRR Record

Updated On : December 4, 2024 / 4:09 PM IST

Pushpa 2 Collections : ప్రస్తుతం దేశమంతా పుష్ప 2 హవానే కనిపిస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో అదరగొడుతుంది ఈ సినిమా. నేడు రాత్రి ప్రీమియర్ షోలు ఆల్మోస్ట్ అన్ని చోట్ల అమ్ముడుపోయాయి. రేపు ఉదయం 4.30 గంటల నుంచే బెన్ఫిట్ షోలతో పుష్ప మొదలుకానుంది. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే పుష్ప 2 సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప కలెక్షన్స్ మీదే ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ అయితే పుష్ప 2 సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది, ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అని లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటివరకు మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా RRR 223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా ఈ రికార్డ్ బద్దలు కొడుతుంది అని అంటున్నారు.

Also Read : Allu Arjun : ఆ థియేటర్లో ఫ్యాన్స్ తో కలిసి.. పుష్ప 2 ప్రీమియర్ షో చూడబోతున్న అల్లు అర్జున్..

ఇప్పటికే 100 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వచ్చేసాయి. రేపు అన్ని థియేటర్స్ లోను ఆరు షోలు వేస్తున్నారు, ఓవర్సీస్ లో కూడా షోలు ఎక్కువ పడుతున్నాయి. దీంతో ఈజీగా 250 కోట్లు దాటిస్తారని, ఫైనల్ టార్గెట్ గా 300 కోట్ల గ్రాస్ మొదటి రోజే కలెక్ట్ చేస్తారని అంటున్నారు. మొదటి రోజు పుష్ప 2 సినిమా RRR రికార్డ్ అయితే బద్దలు కొట్టడం ఖాయం కానీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టిస్తుందో అని ఎదురుచూస్తున్నారు.

ఇక ఫుల్ రన్ లో పుష్ప 2 థియేట్రికల్ బిజినెస్ అయిన సమాచారం ప్రకారం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. దీంతో పుష్ప 2 సినిమా 1500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకుంది. మరి బన్నీ పుష్ప 2 సినిమాతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి..