Allu Arjun : ఆ థియేటర్లో ఫ్యాన్స్ తో కలిసి.. పుష్ప 2 ప్రీమియర్ షో చూడబోతున్న అల్లు అర్జున్..

బన్నీ ఫ్యాన్స్ ఇవాళ రాత్రికే సినిమా చూడాలని టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నారు.

Allu Arjun : ఆ థియేటర్లో ఫ్యాన్స్ తో కలిసి.. పుష్ప 2 ప్రీమియర్ షో చూడబోతున్న అల్లు అర్జున్..

Allu Arjun will Watch Pushpa 2 Movie with Fans in Premiere Show

Updated On : December 4, 2024 / 3:27 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రేపు డిసెంబర్ 5 గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నేడు రాత్రే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు వేస్తున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఇవాళ రాత్రికే సినిమా చూడాలని టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూస్తారని తెలిసింది. నేడు రాత్రి 9.30 గంటల షోకి అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 70mm థియేటర్లో ఫ్యాన్స్ తో కలిసి పుష్ప 2 సినిమా చూడబోతున్నారు. దీంతో రాత్రికి బన్నీ ఫ్యాన్స్ సంధ్య థియేటర్ వద్దకు భారీగా వచ్చే అవకాశం ఉంది.

Also Read : Naga Chaitanya – Rana : పెళ్లి రోజే నాగచైతన్య ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి.. పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అంటూ ప్రశ్న..

ఇప్పటికే పుష్ప 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు సృష్టిస్తుంది. రిలీజ్ కి ముందే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అమెరికాలో కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ 3 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ తో RRR హైయెస్ట్ రికార్డ్ బదులు కొడుతుందా చూడాలి.