Naga Chaitanya – Rana : పెళ్లి రోజే నాగచైతన్య ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి.. పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అంటూ ప్రశ్న..
నేడే నాగచైతన్య - శోభిత పెళ్లి జరగనుంది.

The Rana Daggubati Show Naga Chaitanya Episode Promo Released
Naga Chaitanya – Rana : రానా దగ్గుబాటి ఇటీవల అమెజాన్ ఓటీటీలో ‘ది రానా దగ్గుబాటి షో’ అనే పేరుతో టాక్ షో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ రాగా తాజాగా మూడో ఎపిసోడ్ ప్రోమోని రానా రిలీజ్ చేసాడు. ఈ మూడో ఎపిసోడ్ కి నాగచైతన్య, రానా వైఫ్ మిహీకతో పాటు పలువురు రానా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు.
ఈ ప్రోమోలో రానా.. మా ఫ్యామిలీ అంతా కలిసి సోది వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అని మొదలుపెట్టాడు. నాగచైతన్య పెళ్లి గురించి, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అని అడిగాడు రానా. చైతు పర్సనల్ లైఫ్ కి ఏమైంది బాగుంది అని అన్నాడు. ఇక రానా భార్య మెహీక కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే షోలో చైతు – శోభిత ఫొటోలు కూడా చూపించి వాళ్ళ లవ్ గురించి మాట్లాడించినట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ శనివారం నాడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.
Also Read : Bhumika Chawla : ‘ఒక్కడు’ సినిమా తర్వాత మళ్ళీ 21 ఏళ్లకు.. ఆ డైరెక్టర్ తో భూమిక సినిమా..
అయితే నేడే నాగచైతన్య – శోభిత పెళ్లి జరగనుంది. నేడు రాత్రి వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. దీంతో చైతు పెళ్లి రోజు గిఫ్ట్ గా రానా ఈ ప్రోమో రిలీజ్ చేసాడని సరదాగా అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. రానా, నాగచైతన్య బావ బామ్మర్దులు అవుతారని తెలిసిందే. చిన్నప్పట్నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..
View this post on Instagram
Also Read : Bellamkonda Sai Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. వచ్చే సంవత్సరమే.. నిర్మాత కామెంట్స్..