Pushpa 2 OTT : ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌.. ఈ వారంలోనే.. ఎప్పుడో తెలుసా?

ఈ వారంలో పుష్ప‌2 మూవీలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పుడంటే..

Pushpa 2 OTT streaming date fix

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1890 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దంగ‌ల్ త‌రువాత భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా రికార్డుల‌కు ఎక్కింది. కాగా..ఇటీవ‌ల మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేసి రీలోడెడ్ అంటూ విడుద‌ల చేయ‌గా దానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. కొత్త సీన్ల‌ను చూసేందుకు థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు ప‌రుగులు పెడుతున్నారు.

ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ఎంతో మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిలో అంటూ వార్త‌లు వ‌చ్చినా కూడా ఒక్క‌టి నిజం కాలేదు. ఇక తాజాగా అదిరిపోయే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రో మూడు రోజుల్లో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Allu Arjun : బాల‌య్య‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ శుభాకాంక్ష‌లు.. ‘నా హృద‌యం సంతోషంతో..’

పుష్ప‌2 చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన 56 రోజుల త‌రువాత‌నే డిజిట‌ల్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ఇటివ‌ర‌కే ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే పుష్ప 2 చిత్రం గురువారం (జ‌న‌వ‌రి 30న‌) ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిపింది. రీలోడెన్ వెర్ష‌న్‌ను స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో చూపిస్తోంది. వాస్త‌వానికి పుష్ప 2 చిత్రం 3 గంట‌ల 20 నిమిషాల నిడివితో విడుద‌లైంది. మ‌రో 20 నిమిషాలు యాడ్ చేయ‌డంతో 3 గంట‌ల 44 నిమిషాల నిడివితో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో అందులోబాటులోకి రానుంది.

Kannappa : క‌న్న‌ప్ప నుంచి ప్ర‌భాస్ లుక్ వ‌చ్చేది అప్పుడే.. కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌..

2021లో వ‌చ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా పుష్ప 2 తెర‌కెక్కింది. సుకుమార్ ద‌ర్శ‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించింది. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించ‌గా ఫ‌హ‌ద్ ఫాజిల్‌, సునీల్, జ‌గ‌ప‌తి బాబు, అన‌సూయ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది.