Kannappa : క‌న్న‌ప్ప నుంచి ప్ర‌భాస్ లుక్ వ‌చ్చేది అప్పుడే.. కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌..

క‌న్న‌ప్ప మూవీ నుంచి ప్ర‌భాస్ ఏ పాత్ర‌లో న‌టిస్తున్నాడు? ఈ పాత్ర‌కు సంబంధించిన లుక్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? అని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అప్‌డేట్ ను చిత్ర బృందం ఇచ్చింది.

Kannappa : క‌న్న‌ప్ప నుంచి ప్ర‌భాస్ లుక్ వ‌చ్చేది అప్పుడే.. కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌..

Prabhas look reveal date fix from Kannappa Movie

Updated On : January 27, 2025 / 12:11 PM IST

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కున్న మూవీ క‌న్న‌ప్ప‌. ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌భాస్‌, మోహ‌న్ బాబు, అక్ష‌య్ కుమార్, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మోహ‌న్ లాల్‌, శ‌ర‌త్ కుమార్‌, మ‌ధుబాల.. ఇలా ఎంతో మంది స్టార్ న‌టీన‌టులు న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి దాదాపుగా అంద‌రి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు వ‌చ్చేశాయి.

మంచు విష్ణు, మోహ‌న్ బాబు, కాజ‌ల్ అగ‌ర్వాల్, శ‌ర‌త్ కుమార్ ఇలా అంద‌రి పాత్ర‌ల పోస్ట‌ర్స్ రిలీజ్ చేశారు. అక్ష‌ర్ కుమార్ ఈ చిత్రంలో శివుడిగా క‌నిపించ‌నున్నారు. ఇటీవ‌లే ఆయ‌న లుక్‌ను రివీల్ చేయ‌గా అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. ఇక ప్ర‌భాస్ ఈ చిత్రంలో ఏ పాత్ర‌లో న‌టిస్తున్నారు అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. తొలుత శివుడి పాత్ర‌లో అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఆ పాత్ర‌లో అక్ష‌య్ న‌టిస్తున్న‌ట్లు తేలిపోయింది.

Sankranthiki Vasthunam : ఇదెక్కడి క్రేజ్ రా మావా.. బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన వెంకీ సంక్రాంతికి వస్తున్నాం.. ఇది చూస్తే మైండ్ బ్లాంకే


ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను ఎప్పుడు రివీల్ చేస్తారో అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. తాజాగా దీనిపై చిత్ర బృందం అప్‌డేట్ ఇచ్చింది. ఫిబ్ర‌వ‌రి 3 న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లుక్‌ను విడుద‌ల చేస్తామ‌ని ఓ పోస్ట‌ర్ ద్వారా చెప్పింది. ఈ పోస్ట‌ర్‌లో త్రిషూలం వెనుక‌ ప్ర‌భాస్ క‌న్నులు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఆయ‌న నుదిటిపై ఉన్న బొట్టు మండుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. దీంతో ప్ర‌భాస్ లుక్ కోసం వెయిటింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ లేటెస్ట్ వాచ్ ధర ఎన్ని లక్షల్లో తెలుసా.. ప్రపంచంలో ఇలాంటివి కేవలం..

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్‌లోని అడ‌వుల్లోనే ఈ చిత్రాన్ని దాదాపుగా చిత్రీక‌రించారు. కొంత భాగం రామోజీ ఫిలిం స్టూడియోలో సెట్ వేసి చేశారు. కాగా.. ఈ చిత్రానికి దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టారని వినిపిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా.