Sankranthiki Vasthunam : ఇదెక్కడి క్రేజ్ రా మావా.. బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన వెంకీ సంక్రాంతికి వస్తున్నాం.. ఇది చూస్తే మైండ్ బ్లాంకే
సరికొత్త రికార్డులతో సంక్రాంతికి వస్తున్నాం మూవీ దూసుకుపోతుంది. తాజాగా బాహుబలి 2 మూవీ రికార్డును బద్దలు కొట్టింది

Sankranthiki Vasthunam movie Crossed the Bahubali2 record on day 13 in telugu states
విక్టరీ వెంకటేష్ నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండు వారాలు పూరైనా కూడా ఈ చిత్ర హవా తగ్గలేదు. సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది. తాజాగా బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ విడుదలైన 13వ రోజు రూ.6.77 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రం రిలీజైన 13వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.77 కోట్ల షేర్ కంటే తక్కువ కలెక్షన్లు సాధించినట్లు నిర్మాత బీఏ రాజు టీమ్ తెలిపింది. దీంతో వెంకీ మామ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
RECORD ALERT 🚨🚨#SankranthikiVasthunam now holds the ALL-TIME INDUSTRY RECORD for the highest Collected film on Day 13 in AP&TS 💥💥
The Sensational Blockbuster surpasses #Bahubali2 with a huge share of ₹6.77 Crores 🔥🔥🔥@VenkyMama @AnilRavipudi @SVC_official pic.twitter.com/5qg43tEtA0
— BA Raju’s Team (@baraju_SuperHit) January 27, 2025
Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ లేటెస్ట్ వాచ్ ధర ఎన్ని లక్షల్లో తెలుసా.. ప్రపంచంలో ఇలాంటివి కేవలం..
ఇదిలా ఉంటే.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజైన 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.260 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఈ చిత్రం హవా చూస్తుంటే మరో మూడు, నాలుగు రోజుల్లో రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
#BlockbusterSankranthikiVasthunam continues it’s Box Office Sambhavam 💥💥💥
260crores+ worldwide gross in just 12 days for #SankranthikiVasthunam 🔥🔥
ALL TIME HIGHEST FOR A REGIONAL FILM ❤️🔥❤️🔥❤️🔥
Victory @venkymama @anilravipudi @aishu_dil @Meenakshiioffl #BheemsCeciroleo… pic.twitter.com/rgDgmuI2GW
— Sri Venkateswara Creations (@SVC_official) January 26, 2025
ఈ మూవీ తొలిరోజే రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఇక నార్త్ అమెరికాలో ఈ చిత్రం మూడు మిలియన్ డాలర్ల వసూళ్లు దిశగా దూసుకుపోతుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు కథానాయికలు నటించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. అయితే.. ఎప్పుడు చేయనున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. గతంలో ఎఫ్ 2, ఎఫ్ 3 లు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.