Allu Arjun : వరుసగా నాలుగు సినిమాలు.. బన్నీ లైనప్.. పుష్ప 3 తర్వాత నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్..?
పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఏంటి? ఎప్పుడు అనే చర్చ నడుస్తూనే ఉంది.

Allu Arjun Next Movies Lineup Trivikram Allu Arjun Movie Update
Allu Arjun : అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజయి 50 రోజులు దాటుతున్నా ఇంకా పలు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ఆడుతుంది ఈ సినిమా. ఇటీవల మరో 20 నిమిషాల సీన్స్ జత చేయడంతో జనాలు ఇంకా వస్తున్నారు. ఇప్పటికే 1850 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలుకొట్టింది ఈ సినిమా. పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఏంటి? ఎప్పుడు అనే చర్చ నడుస్తూనే ఉంది.
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా హారికా హాసిని నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్ తో మైథలాజికల్ టచ్ తో ఉండబోతుందని సమాచారం. ఇటీవల నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎవరూ ఊహించని ఓ కొత్త సినిమా అవుతుంది ఇది అని అప్పుడే హైప్ పెంచేశారు.
Also See : Priyanka Mohan : OG భామ ప్రియాంక మోహన్.. పచ్చని చీరలో ఎంత క్యూట్ గా ఉందో..
పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ సినిమానే ఉంటుందని క్లారిటీ రాగా ఈ సినిమా ఫిబ్రవరి నుంచి మొదలవుతుందని తెలుస్తుంది. ఫిబ్రవరిలో సెట్ వర్క్స్, పూజా కార్యక్రమాలు జరుగుతాయని మార్చ్ నుంచి షూటింగ్ కి వెళతారని సమాచారం. అయితే పుష్ప రెండు సినిమాల వల్ల బన్నీకి ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయిపోయాయి. అందుకే ఈ గ్యాప్ ని తగ్గించడానికి ఫాస్ట్ గా మళ్ళీ సినిమాలు చేయాలని కుదిరితే సంవత్సరానికి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఈ క్రమంలో త్రివిక్రమ్ సినిమా తర్వాత వెంటనే డైరెక్టర్ అట్లీతో సినిమా ఉంటుందని తెలుస్తుంది. అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ కి బాగా కనెక్ట్ అయిన నార్త్ ఆడియన్స్ పల్స్ పట్టుకొని కమర్షియల్ కథ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత పుష్ప 3, సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఉన్నాయి. సుకుమార్ RC17 సినిమాతో, సందీప్ రెడ్డి ప్రభాస్ స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్లలో ఎవరు ముందు ఫ్రీ అయితే వారి సినిమా మొదలవుతుందని తెలుస్తుంది.
Also Read : Balakrishna : పద్మ భూషణ్ రావడంపై మొదటిసారి మీడియాతో మాట్లాడిన బాలయ్య.. లేట్ గా వచ్చిందా అని అడిగితే..
ఇటీవల బన్నీ ముంబై వెళ్లి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని కలిసాడు. దీంతో వీరి కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ అది వర్కౌట్ అవ్వలేదని సమాచారం. దీంతో బన్నీ నెక్స్ట్ సినిమాపై అధికారిక క్లారిటీ మాత్రం ఫిబ్రవరిలో వస్తుందని టాలీవుడ్ టాక్.