Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ లేటెస్ట్ వాచ్ ధర ఎన్ని లక్షల్లో తెలుసా.. ప్రపంచంలో ఇలాంటివి కేవలం..
తాజాగా షారుఖ్ ఖాన్ వాచ్ వైరల్ గా మారింది.

Shah Rukh Khan Latest Watch goes Viral Shocking Price Surprised
Shah Rukh Khan : సాధారణంగా సెలబ్రిటీలు వాడే వస్తువులు చాలా కాస్ట్లీ ఉంటాయని తెలిసిందే. హీరోలు అయితే షూస్, వాచ్ లు, డ్రెస్ లు బ్రాండెడ్ వి, కాస్ట్లీవి వాడతారు. అప్పుడప్పుడు పలువురు హీరోల కాస్ట్లీ వస్తువులు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా షారుఖ్ ఖాన్ వాచ్ వైరల్ గా మారింది. షారుఖ్ ఓ బాలీవుడ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్లో అందరి చూపు షారుఖ్ వాచ్ పైనే పడింది. మరి షారుఖ్ పెట్టుకున్న వాచ్ అంత ఖరీదైనది.
Also Read : Allu Arjun : వరుసగా నాలుగు సినిమాలు.. బన్నీ లైనప్.. పుష్ప 3 తర్వాత నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్..?
షారుఖ్ ఖాన్ పెట్టుకున్న వాచ్ అడెమర్స్ పిగట్ బ్రాండ్ వాచ్. ఇది 18 క్యారెట్ స్యాండ్ గోల్డ్ తో తయారవుతుందట. ఈ మోడల్ వాచ్ లు ప్రపంచం మొత్తం మీద కేవలం 250 మాత్రమే ఉన్నాయట. ఒక్కో వాచ్ ఖరీదు అక్షరాలా 76 లక్షల పైనే. దీంతో ఈ వాచ్ ఖరీదు తెలిసి ఫ్యాన్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి బాలీవుడ్ బాద్ షా అంటే ఆ మాత్రం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ వాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన టాలీవుడ్ లో ఎక్కువగా ఎన్టీఆర్ వాచ్ లు ఖరీదైనవి అని వైరల్ అవుతూ ఉంటాయి. ఎన్టీఆర్ దగ్గర ఖరీదైన వాచ్ ల కలెక్షన్ ఎక్కువే ఉంది.
Also See : Priyanka Mohan : OG భామ ప్రియాంక మోహన్.. పచ్చని చీరలో ఎంత క్యూట్ గా ఉందో..
ఇక బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొన్నాళ్ల క్రితం వరకు వరుస ఫ్లాప్స్ చూసి 2023లో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం షారుఖ్ చేతిలో ఒకటే సినిమా ఉందని సమాచారం. గతంలో లాగా వరుస సినిమాలు చేయకుండా ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు షారుఖ్. అలాగే షారుఖ్ కూతురు సుహానా మెయిన్ లీడ్ లో చేస్తున్న సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నాడని బాలీవుడ్ టాక్. షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా మరి తన మొదటి సినిమాతో త్వరలో రాబోతున్నాడు.